బూతు అనేది లేకుండా సెక్సీ భామ ఐటం
బాలీవుడ్ సినిమాల ఐటం సాంగుల్లో ఈ మధ్య హీరోయిన్ల జోరు పెరిగి పోయిన విషయం తెసిందే. కత్రినా, కరీనా లాంటి టాప్ హీరోయిన్లు హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ థియేటర్లను షేక్ చేస్తున్నారు. కత్రిన నటించిన 'షీలాకీ జవాని', 'చికినీ చమేలీ' సాంగులు ఆయా సినిమాలకు భారీ పాపులరిటీని సంపాదించి పెట్టాయి కూడా.
డర్టీ పిక్చర్ సినిమా ద్వారా సెక్సీ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విద్యా బాలన్ కూడా త్వరలో ఐటం సాంగులో మెర బోతోంది. 'ఫెరారీ కి సవారి' చిత్రానికి గాను విద్యాను ఐటం గర్ల్‌గా ఎంపిక చేశారు. రాజేష్ మస్సూకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విధు వినోద్ చోప్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శర్మాన్ జోషి, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అయితే విద్యా నటించే ఈ సాంగులో రొటీన్ ఐటం సాంగు మాదిరి ఎక్స్ ఫోజింగ్, అంగాంగ ప్రదర్శన, బూతు సాహిత్యం లాంటి మసాలా ఉండదట. ఈ ఐటం సాంగులో విద్యాను డిఫరెంట్ గా చూపించబోతున్నారట. చూద్దాం... మసాలా వేయకుండా రుచిగా నాన్ వెజ్ తినిపిస్తామని చెబుతున్న వీరి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో.


Click it and Unblock the Notifications











