కాన్స్ : కప్ప, బాతు మాంసంతో విద్యా బాలన్‌కు విందు!
కాన్స్ : భారతీయ సినీ సెలబ్రిటీకి కాన్స్ లాంటి ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్‌లో జడ్జిగా వ్యవహరించే అవకాశం దక్కడం నిజంగా గర్వకారణమే. ప్రస్తుతం జరుగుతున్న 66వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది బాలీవుడ్ హాట్ లేడీ విద్యా బాలన్. కాన్స్ జూరీ మెంబర్‌గా విద్యాబాలన్ ఎంపికైన సంగతి తెలిసిందే.
ప్రతిష్టాత్మక బాధ్యత చేపట్టిన విద్యా బాలన్‌కు అందుకు తగిన విధంగానే అక్కడ గౌరవం దక్కుతోంది. అయితే జూరీ మెంబర్స్‌తో ఇక్కడ విందులో పాల్గొన్న విద్యా బాలన్‌కు వింత అనుభవం ఎదరైంది. ఆమెకు వడ్డించిన భోజనంలో కప్ప, బాతు మాంసంతో చేసిన పదార్థాలు ఉన్నాయట.
ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం...ఇటీవల విద్యా బాలన్ స్టీవెన్ స్పీల్ బర్గ్, నికోలస్ కిడ్‌మాన్, ఆంగ్ లీ లాంటి ప్రముఖులతో కలిసి గ్రాండ్ జూరీ లంచ్‌లో పాల్గొంది. ఇందులో ఆమెకు కప్ప మాంసం, బాతు మాంసం, కోడి మాంసంతో తయారు చేసిన వంటలు వడ్డించారట.
మన దేశంలో కప్పలు, బాతు మాసంతో చేసిన వంటకాలు తినరు. కానీ విదేశాల్లో వీటితో పాటు చాలా రకాల ప్రాణుల మాంసాన్ని లొట్టలేసుకుని తింటుంటారు. మరి విద్యా బాలన్ ఈ వంటకాలు వడ్డించినపుడు ఎలా రియాక్టయిందో ఏమో? పైగా విద్యాబాలన్ తమిళ బ్రాహ్మిణ్. ఇండియాలో బ్రాహ్మణులు మాంసాహారం ముట్టరు.


Click it and Unblock the Notifications












