హైదరాబాద్ కేసు కొట్టేయండి: విద్యాబాలన్
హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో తన పై నమోదైన కేసు కొట్టి వేయాలని కోరుతూ బాలీవుడ్ నటి విద్యాబాలన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అదే విధంగా కేసు నమోదైన తర్వాత జరిగే తదుపరి చర్యలన్నింటిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటీషన్లో హైకోర్టును అభ్యర్థించింది.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'డర్జీ పిక్చర్'లో విద్యాబాలన్ అసభ్యంగా నటిచండం, ఆ సినిమా విడుదల సందర్భంగా విడుదల చేసిన జుగుప్సాకరమైన, అశ్లీల పోస్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆజాద్ అనే న్యాయవాది హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు నల్లకుంట పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసు వల్ల తనకు అనవసర తిప్పలు తప్పవని భావించిన విద్యా కేసు కొట్టేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించింది.
మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించిన డర్టీ పిక్చర్ ను ఏక్తాకపూర్ నిర్మించారు. ఈ సినిమాలో విద్యాబాలన్ తో పాటు, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











