ఓ డైరెక్టర్ ఏకంగా రూమ్‌కి రమ్మన్నాడు.. విద్యాబాలన్ సెన్సేషనల్ కామెంట్స్
Recommended Video
సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళా నటులను నమ్మించి వంచిస్తున్నారంటూ పలువురు నటీమణులు ఆరోపిస్తుండటంతో ఈ ఉదంతాలు చర్చనీయాంశంగా మారాయి. సరిగ్గా ఈ తరుణంలో సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పి షాకిచ్చింది. ఇంతకీ విద్యాబాలన్ ఏం చెప్పింది? వివరాల్లోకి పోతే..

విద్యాబాలన్ సినీ ప్రయాణం
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్‌లో ఒకరిగా ఎదిగారు విద్యాబాలన్. 2005 వచ్చిన ‘పరిణీత' మూవీతో తొలి విజయం ఖాతాలో వేసుకున్న ఆమె.. 2017లో వచ్చిన తుమ్హారీ సులు వరకు పలు విజయాలు, ప్లాపులు ఎదుర్కొన్నారు. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా, సౌత్ సినీ పరిశ్రమలో కూడా ఆమె నటించి మెప్పించారు.

విద్యాబాలన్ చేదు అనుభవం
అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించింది విద్యాబాలన్. ఏకంగా ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మని పిల్చాదంటూ సంచలన విషయాలు బయటపెట్టింది విద్యాబాలన్. ఆమె చెప్పిన కొన్ని విషయాలు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి.

రూమ్‌కి రమ్మంటూ వెకిలి చేష్టలు
సినిమా కాన్సెప్ట్ చెప్పడానికి ఓ దర్శకుడు తన దగ్గరకు వచ్చాడని, కథను వివరిస్తానని చెబుతూ ప్రైవేట్ సమయం కోరాడని చెప్పింది విద్యాబాలన్. దానికి తాను ఓకే చెప్పేసి కాఫీ షాప్‌లో కలుద్దామని అనగా.. ఆ దర్శకుడు మాత్రం తన రూమ్‌కు రావాలంటూ హిట్స్ ఇస్తూ వాచాడని విద్యాబాలన్ వెల్లడించింది. రూమ్‌కి ఎందుకు? కాఫీ షాప్‌లో కలుద్దామని తను చాలాసార్లు చెప్పినప్పటికీ, అతడు మాత్రం రూమ్‌కే రమ్మంటూ వెకిలి చేష్టలు చేశాడని విద్యా చెప్పుకొచ్చింది.

ఐదు నిమిషాల పాటు ఆలోచించి
చివరకు తాను అతని వైపు కోపంగా చూస్తూ బయటకి వెళ్లమన్నట్లుగా ముఖం పెట్టడంతో.. ఐదు నిమిషాల పాటు ఆలోచించి బయటకి వెళ్లిపోయాడని ఆమె చెప్పింది. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని విద్యాబాలన్ చెప్పింది. కాకపొతే ఆ దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు విద్యా.

విద్యాబాలన్ సినిమాలు
ఇక విద్యాబాలన్ సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన ‘మిషన్ మంగళ్' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్, తాప్సీ పన్నూ, కీర్తి కుల్హారీలతో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 11 రోజుల్లో రూ. 164 కోట్లు వసూలు చేసి రూ. 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.


Click it and Unblock the Notifications











