ఎన్టీఆర్ ఇంటికి విద్యాబాలన్.. సెంటిమెంట్ కోసం అక్కడికి.. బాలయ్య ఎమోషనల్!

By Rajababu

Recommended Video

Vidya Balan Starts Shooting For the NTR Biopic

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారిన సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించడం అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని కలిగించింది. అదేమిటంటే..

విద్యాబాలన్‌పై కీలక సన్నివేశాలు

విద్యాబాలన్‌పై కీలక సన్నివేశాలు

ఎన్టీఆర్ బయోపిక్‌లోని కొన్ని సన్నివేశాలను ఇటీవల విద్యాబాలన్‌పై ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో షూట్ చేశారనే వార్త ఆసక్తిని రేపుతున్నది. గతంలో ఎన్టీఆర్ నివాసమున్న బంజారాహిల్స్‌‌లోని ఇంటిలో చిత్రీకరించారట. ప్రస్తుతం ఎన్టీఆర్ నివాసాన్ని అపార్ట్‌మెంట్‌గా మార్చారు. ఆ అపార్ట్‌మెంట్‌లోనే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

సెంటిమెంట్ ఇంట్లో షూటింగ్

సెంటిమెంట్ ఇంట్లో షూటింగ్

గతంలో ఆ ఇంటిని ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించేవారట. ఎన్టీఆర్ మనసులో ఆ ఇంటికి ప్రత్యేక స్థానం ఉండేదట. ఆ నివాసాన్ని ఎన్టీఆర్‌ అదృష్టంగా భావించేవారట. అందుకే సెంటిమెంట్‌లో భాగంగా ఆ ఇంట్లో షూట్ చేసినట్టు తెలిసింది.

ఎమోషనల్‌గా బాలకృష్ణ

ఎమోషనల్‌గా బాలకృష్ణ

ఎన్టీఆర్ అత్యంత లక్కీగా భావించే ఇంటిలో కొన్ని కీలక సన్నివేశాలను విద్యాబాలన్, బాలకృష్ణలపై చిత్రీకరించారు. ఆ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ ఎమోషనల్‌గా మారారు. ఆ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి అని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కీలక పాత్రలో బెంగాళీ నటుడు

కీలక పాత్రలో బెంగాళీ నటుడు

ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా దగ్గుబాటి సీఎం చంద్రబాబుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిగా కనిపించబోతున్నారు. బెంగాళీ నటుడు జిషు సేన్‌గుప్తా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.

సంక్రాంతికి విడుదల

సంక్రాంతికి విడుదల

ఎన్టీఆర్ బయోపిక్‌ను నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి భాగస్వామ్యులయ్యారు. సంక్రాంతికి ముస్తాబవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X