ప్రియుడితో పాటు సేఫ్‌గా ఎస్కేపైన విద్యాబాలన్
బాలీవుడ్ హాట్ హీరోయిన్ విద్యాబాలన్ ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలో తప్పించుకుందట. ఆ సమయంలో తన ప్రియుడు సిద్ధార్థ రాయ్ కపూర్ కూడా ఆమె వెంటే ఉన్నాడు.
అసలు ఏం జరిగిందంటే...
నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవడానికి విద్యాబాలన్ ప్రియుడు సిద్దార్థరాయ్‌కపూర్‌తో కలసి న్యూజిలాండ్ వెళ్లింది. డిసెంబర్ 23న న్యూజిలాండ్‌లోని ప్రముఖ పట్టణం క్రైస్ట్‌చర్చ్ భూకంప తాకిడికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23న క్రైస్ట్‌చర్చ్‌లో గడపాల్సివుందట. భూకంపం నగరాన్ని తాకే గంట మందు ఈ జంట అక్కడి నుంచి మరో పట్టణం క్వీన్స్‌టన్ చేరుకున్నారు. ప్రమాదం నుంచి ఎస్కేప్ అయిన విషయం తెలుసుకుని ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
డర్టీ పిక్చర్ భారీ విజయంతో ఓవర్ నైట్ స్టార్ గా మారి పోయిన విద్యా బాలన్ ఇప్పడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లతో పోటీ పడుతోంది. రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తోంది. యూటీవీ పిక్చర్ యజమాని సిద్ధార్థ రాయ్ కపూర్‌తో ప్రేమాయణం నడిస్తున్న ఈ భామ.....ఆయన్ను మచ్చిక చేసుకుని పెద్ద సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవాలనే ప్లాన్ లో ఉందట.


Click it and Unblock the Notifications











