ఎన్టీఆర్ ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యా, గర్వంగా ఉంది: విద్యాబాలన్
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.
విద్యాబాలన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఇక్కడ నా కెరీర్ ఇంత మంచి సినిమాతో మొదలవ్వడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత ఎమోషనల్ అయ్యాను. తెరపై కనిపించేది బాలయ్య అని నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. బాలయ్య ఎనర్జీ, పాషన్ అద్భుతం. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇలాంటి సినిమాలో చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా వల్ల బాలకృష్ణ గారి ఫ్యామిలీ నా ఫ్యామిలీగా అయిపోయిది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడ నాకో ఫ్యామిలీ ఉందనే ధైర్యం వచ్చింది అన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో, ట్రైలర్ లాంఛ్ వేడుకలు శుక్రవారం (డిసెంబర్ 21) గ్రాండ్‌గా ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు.

నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు.


Click it and Unblock the Notifications











