సిల్క్ స్మిత కుటుంబాన్ని కలవటం పబ్లిసిటీ స్టంటేనా?
బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఇప్పుడు సిల్క్ స్మిత బంధువులను, కుటుంబ సభ్యులను త్వరలో కలవబోతోంది. సిల్మ్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా విద్యాబాలన్ హీరోయిన్ గా మిలన్ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్న 'ది డర్టీ పిక్చర్' చిత్రం కోసం ఈ చెన్నై టూర్ వేయనుంది. అలాగే పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు సిల్క్ స్మిత స్వస్ధలం. అక్కడకు కూడా ఆమె రానుంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.."నిజ జీవిత గాథల్ని తెరకెక్కించేటపుడు కొన్ని ప్లాబ్లంస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే వాటిని పరిష్కరించుకుంటే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయి. ఆ ఆలోచనతోనే సిల్మ్ స్మిత కుటుంబ సభ్యులును, బంధువులను కలుస్తున్నాం. వారి నుంచి వచ్చే అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటానకి ప్రయత్నిస్తాం. అలాగే వారందరినీ కలుసుకొని వారి నుంచి అనుమతి తీసుకున్నాకే ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకొన్నాను అంది. అయితే ఇదంతా ఓ పబ్లిసిటీ స్టంట్. వర్మ రక్త చరిత్ర నిమిత్తం అనంతపూర్ ని సందర్శించినట్లే విద్యాబాలన్ కూడా చేయబోతోందని ఓ వర్గం విమర్శలు చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తోంది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











