నేడే చూడండి..అమితాబ్‌తో కలసి విద్యాబాలన్ 'ఊ ల లా'..
విద్యాబాలన్ దక్షణాది సినిమా పరిశ్రమ నుండి బాలీవుడ్‌లోకి ప్రవేశించి తన అందచందాలతో యావత్ ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్న నటి. విద్యాబాలన్ ప్రస్తుతం డర్టీ పిక్టర్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. త్వరలో యావత్ ఇండియా మొత్తం ఈ సినిమాని విడుదల చేసేందుకు నిర్మాత ఏక్తాకపూర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నటి సిల్కు స్మిత జీవిత ఆధారంగా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్ హాట్ హాట్ సన్నివేశాలలో నటించడం జరిగింది. ఈ విషయం సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.
డర్టీ పిక్చర్ ప్రమోషన్‌లో భాగంగా ఈరోజు(బుధవారం) విద్యాబాలన్ బాలీవుడ్ సూపర స్టార్ అమితాబ్ వ్యాఖ్యతగా వ్యవహారిస్తున్న 'కౌన్ బనేగా కరొడ్ పతి 5' సిరిస్ కార్యక్రమంలో 'ఊ ల లా' గెస్టుగా రానున్నారు. ఇది ఇలా ఉంటే విద్యా బాలన్ పా సినిమాలో అమితాబ్ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. పా సినిమాలో అమితాబ్ ప్రోజేరియా వ్యాధితో భాదపడే బాలుడిగా నటించగా, తల్లిగా విద్యాబాలన్, తండ్రిగా అభిషేక్ బచ్చన్ నటించారు.
'కౌన్ బనేగా కరొడ్ పతి 5' సిరిస్ కార్యక్రమాన్ని సోనీ టివి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన డర్టీ పిక్చర్ ఆడియో శ్రోతలని ఊర్రూతలూగిస్తున్నాయి. ఈ సినిమాలో విద్యాబాలన్‌తో పాటు నజీరుద్దీన్ షా, ఇమ్రాన్ హాస్మి తదితరులు నటించారు. డర్టీ పిక్చర్ సినిమాకి సంబంధించిన పోటోలు మార్కెట్లో ఇప్పటికే హాల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











