twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    6నెలల గర్భవతి కాబోతున్న డర్టీ హీరోయిన్...!?

    By Sindhu
    |

    ఏంటి డర్టీహీరోయిన్ విద్యాబాలన్ నెలతప్పిందా అని కంగారు పడకండి. అలాంటిదేమీ లేదు కానీ ఈ సెక్సీ హీరోయిన్ త్వరలో సుజాయ్ ఘూష్ దర్శకత్వంలో హాలీవుడ్ సినిమా 'కిల్ బిల్" ఆధారంగా తెరకెక్కనున్న 'కహాని" సినిమాలో ఆరె నెలల గర్భవతిగా నటిస్తుందని సమాచారం. 6నెలల గర్భవతి అయిన ఓ అమ్మాయి పనిపైన వెళ్లిన తన భర్త తప్పిపోయినాడని తెలుసుకొని కలకత్తా వచ్చి అక్కడ తన భర్తని వెతుక్కుంటూ తిరుగుతుందని ఈ సినిమా కథ సారాశం.

    ఆ సమయంలో జరిగిన అనుభవాల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం డర్టీ పిక్చర్ సినిమాలో నటిస్తున్న విద్యా ఇప్పటి నుండే గర్భవతి గా ఉన్న మహిళలను అడిగి తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తోందట. మెన్న సిల్క్ స్మిత, ఇవాళ గర్భవతి అయిన విద్య ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో నటిగా తన సత్తాను నిరూపించుకోవడానికి ఫుల్లుగా హోమ్ వర్క్ చేస్తోందని సమాచారం.

    విద్యాబాలన్ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క డర్టీ పిక్చర్ తోనే వస్తున్నందుకు విద్యాబాలన్ కూడా ఆనందంలో మునిగిపోతుంది. దక్షిణాది శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా డర్టీ పిక్చర్. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్, ఫోటోలు బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ సినిమాలో విద్యాబాలన్ విచ్చలవిడిగా అందాలు ఆరబోసిందనడానికి సాక్ష్యం గా ఉన్నాయి ఆ ఫోటోలు. తుషార్ కపూర్, ఎమ్రాన్ హష్మీ, శ్రేయ ఘోషల్, నటిస్తున్న ఈ చిత్రం కోసం యావత్తు ప్రపంచం ఆసక్తి ఎదురుచూస్తున్న సెక్సీ ఫిల్మ్ "డర్టీ పిక్చర్" త్వరలో విడుదల కానుంది.

    English summary
    Vidya Balan will be seen in a totally different avatar in Sujoy Ghosh's Kahaani. The actress will be seen as a woman with a six-month baby belly. And it is not just in passing. The actress will be seen with a big bump throughout the film. Shot in Kolkata and London the film will be out some time mid 2011. A source reveals, "Vidya's character is that of a pregnant woman whose husband travels from London to India for work. However, he goes missing and she comes to Kolkata in search of him."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X