Vidyullekha స్విమ్ సూట్లో దర్శనం.. నీ విడాకులు ఎప్పుడన్న నెటిజన్ కి దిమ్మతిరిగే సమాధానం !
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ సడన్ గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన సంగతి తెల్సిందే. ఆమె తెలుగులో కూడా సుపరిచితురాలు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె ఆ తర్వాత కొన్ని స్ట్రెయిట్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్న తరువాత స్విమ్ సూట్ ఫోటోలు షేర్ చేయడంతో ఆమెను నీ విడాకులు ఎప్పుడు అంటూ అడగడం మొదలు పెట్టారు. దానికి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

విడాకుల ఎఫెక్ట్
ఈ మధ్య కాలంలో సమంత - అక్కినేని నాగచైతన్యల విడాకులు సంచలనంగా మారాయి. అయితే వారి విడాకులకు కారణాలు ఏవీ వెల్లడించలేదు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు సమంత హాట్ డ్రెస్సులు వేసుకోవడం వల్లే ఇంత దాకా వచ్చిందని కామెంట్లు చేస్తూ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఫోటో షేర్ చేసిన విద్యుల్లేఖ మీద అలాగే విరుచుకు పడ్డారు. దానికి ఆమె అదిరే సమాధానం ఇచ్చింది.

అలా ఎంట్రీ
ప్రముఖ తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి పేరు సాధించుకున్నారు. ఇక విద్యుల్లేఖ ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కింది. సంజయ్ అనే వ్యక్తి ఆమె వెయిట్ లాస్ కోచ్ గా పరిచయం కాగా అతనితో ప్రేమలో పడి అతనినే వివాహం చేసుకుంది.

ఆ పిక్ షేర్ చేయడంతో
విద్యుల్లేఖ తెలుగులో ధృవ, రాజా ది గ్రేట్, సరైనోడు లాంటి చిత్రాల్లో తనదైన శైలిలో నటించింది. చివరగా అల్లుడు అదుర్స్ చిత్రంలో విద్యుల్లేఖ నటించింది. ఆమె నటించిన గల్లీ రౌడీ సినిమా చివరిగా రిలీజ్ అయింది. ఇక తాజాగా విద్యులేఖ రామన్ ఇటీవల స్విమ్‌సూట్ ధరించిన చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ పిక్ లో భలే హాట్ గా ఉన్నావని కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం విద్యులేఖ విడాకుల గురించి మాట్లాడటం ప్రారంభించారు మరియు ఆమె ఫొటోకు అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు.

మాల్దీవులకు వెళ్లడంతో
విద్యులేఖ భర్త సంజయ్ తో మాల్దీవులకు వెళ్లారు. అక్కడ విద్యుల్లేఖ రామన్ స్విమ్ సూట్ లో ఉన్న తన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే విద్యులేఖ షేర్ చేసిన ఈ ఫోటో చూసినప్పుడు కొంతమంది ఆమె మీద దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. దీంతో విద్యులేఖ రామన్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ కామెంట్లు చేసిన వ్యక్తులకు తగిన సమాధానం ఇచ్చారు.

వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారా?
తన ఫోటోకి రకరకాల కామెంట్లు పెడుతున్నారని.. కొందరు విడాకులు ఎప్పుడు?' అని మెసేజ్ చేస్తున్నారని తెలిపింది. అలాగే దీనిపై స్పందిస్తూ.. 1920 నుంచి 2021లోకి రండి. సమాజంలో ఆలోచనా విధానం పెద్ద సమస్య, ఒకవేళ ఆడవాళ్లు వేసుకునే బట్టలు విడాకులకు కారణం అయితే... సంప్రదాయంగా బట్టలు వేసుకునే వారంతా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారా? అని విద్యుల్లేఖ ప్రశ్నించింది.
Recommended Video

అలాంటి భర్త దొరకడం అదృష్టం
సంజయ్ వంటి సురక్షితమైన మరియు స్థిరపడిన భర్తను కలిగి ఉండటం నా అదృష్టం, అతను ఆ కామెంట్స్ ను పట్టించుకోవద్దని నాకు చెప్పాడు, కానీ నేను దాన్ని ఇలా వదిలేయని అని అన్నారు. ఇక 'మీ విషపూరితమైన, సంకుచితమైన మనస్సులు, జీవితం పట్ల అత్యంత తిరోగమన దృక్పథాన్ని నేను మార్చలేనని ఆమె అన్నారు. జీవితంలో స్త్రీలు మీ సెక్సిస్ట్, అణచివేత మనస్సు గల వ్యక్తులకు వ్యతిరేకంగా నిలబడాలని నేను ఆశిస్తున్నాను, బ్రతుకు బ్రతికించు. అంటూ ఆమె కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











