ఆరోగ్య సమస్యలు వచ్చాయ్.. లావు తగ్గడంపై అలాంటి కామెంట్లు.. విద్యుల్లేఖ ఎమోషనల్

ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎంత మంది ఉన్నాకూడా లేడీ కమెడియన్స్ మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. లావుగా ఉంటేనో, నల్లగా, బొద్దుగా ఉంటేనో కమెడియన్స్ అవుతారనే భావన ఉంటుంది. కానీ మంచి టైమింగ్, నటన ఉంటేనే కమెడియన్స్‌గా రాణిస్తారు. కానీ గీతా సింగ్, విద్యుల్లేఖ రామన్ వంటి వారు లావుగా ఉండటంతో స్క్రీన్ మీద హాస్యాన్ని పండించారు. అయితే ఆ మధ్య విద్యుల్లేఖ రామన్ బాగా సన్నపడిపోయింది. ఆ ఫోటోలను చూసి అందరూ షాక్ అయ్యారు.

వాటితో ఫేమస్..

వాటితో ఫేమస్..

విద్యుల్లేఖ రామన్ ఎక్కువగా తమిళ, తెలుగు చిత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. సరైనోడు సినిమాలో తమిళ కోడలిగా బాగా నటించింది. రన్ రాజా రన్, రాజు గారి గది, దువ్వాడ జగన్నాథం ఇలా ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా నటించి అందరినీ మెప్పించింది. హీరోయిన్లకు స్నేహితురాలి పాత్రల్లోనూ చాలా సినిమాల్లో కనిపించింది.

ఆ మధ్య అలా..

ఆ మధ్య అలా..

విద్యుల్లేఖ రామన్ రాను రాను మరింత లావుగా తయారైంది. కానీ ఆ మధ్య ఓ సారి సడెన్‌గా ఓ ఫోటోను షేర్ చేసి షాకిచ్చింది. మొత్తంగా సన్నపడి కనిపించింది. వర్కవుట్లు చేసి ఇలా జీరో సైజ్‌లోకి మారేందుకు ప్రయత్నించింది. మొత్తానికి విద్యుల్లేఖ రామన్ మాత్రం తన శరీరాకృతిని మార్చుకుంది.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

విద్యుల్లేఖ తాను అలా మారడానికి కారణాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సంపూర్ణేశ్ బాబు పుడింగి నెంబర్ వన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీ ప్రారంభోత్సవంలో భాగంగా విద్యుల్లేఖ మాట్లాడుతూ ఎమోషనల్అయింది. తాను ఇలా మారిపోవడానికి కారణాలు కూడా వివరించింది.

ఆరోగ్య సమస్యలు..

ఆరోగ్య సమస్యలు..


నేను లావు ఎక్కువ అవుతుండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయ్.. అందుకే నేను నా శరీరాకృతి మీద దృష్టి పెట్టాను. చాలా తగ్గాను. అయితే ఆ సమయంలో మాత్రం నాపై వింత కామెంట్లు చేశారంటూ విద్యుల్లేఖ ఎమోషనల్ అయింది.

Recommended Video

Malli Malli Chusa Movie Public Talk | Anurag Konidena | Shweta Avasthi
అలాంటి కామెంట్లతో..

అలాంటి కామెంట్లతో..

ఇక కమెడియన్‌గా చేయవా? హీరోయిన్‌గానే చేస్తావా? అంటూ నా మీద కౌంటర్లు వేశారు. అయితే నేను లీడ్ రోల్ చేస్తూ కామెడీ చేయాలని అనుకున్నాను. అలా నేను కలలు కంటున్న సమయంలోనూ కలలాగా ఈ మూవీ ఆఫర్ వచ్చిందంటూ విద్యుల్లేఖ చెప్పుకొచ్చింది. సంపూర్ణేశ్ బాబు పక్కన.. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ అని విద్యుల్లేఖ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X