twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లయిన మర్నాడే తప్పు చేశామంటూ క్షమాపణలు చెప్పిన విగ్నేష్..అందుకే అలా అంటూ!

    |

    చాలా కాలంగా ప్రేమలో ఉన్న నయనతార-విగ్నేష్ శివన్ ఎట్టకేలకు జూన్ 9న ఘనంగా వివాహం చేసుకున్నారు. ముందుగా తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకున్నా, సెక్యూరిటీ ఇబ్బందులతో తిరుమలలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని చెన్నై దగ్గరలోని మహాబలిపురం షెరటాన్ హోటల్లో చేసుకున్నారు. వీరి పెళ్ళికి చాలా మంది సౌత్ సెలబ్రిటీలు చాలా మంది వచ్చారు. అయితే పెళ్లి తర్వాత రోజే ఈ కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఒక వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఈ వివాదం మీద నయనతార భర్త స్పందించారు.

     చెప్పులు వేసుకుని

    చెప్పులు వేసుకుని

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో బాగానే ఉన్నా దర్శనం అయ్యాక తిరుమల మాడ వీధుల్లో నయనతార చెప్పులు వేసుకొని నడిచారు. విగ్నేష్ సహా మిగతా వాళ్ళు మాములుగానే ఉన్నా ఆమె ఒక్కతే చెప్పులు వేసుకోవడం చర్చనీయాంశం అయింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల మాడ వీధుల్లో నయనతార చెప్పులు వేసుకొని తిరగడంతో భక్తులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు.

    క్షమాపణలు కోరుతూ

    క్షమాపణలు కోరుతూ


    ఇక ఈ విషయంలో టీటీడీ కూడా సీరియస్ అయింది. అంతే కాక ఈ విషయంలో కేసు నమోదు చేస్తామని కూడా టీటీడీ సంబంధింత అధికారి తెలిపారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ విషయం మీదనే చర్చ జరుగుతున్న క్రమంలో ఈ విషయంలో అందరికీ క్షమాపణలు కోరుతూ నయనతార భర్త విగ్నేష్ శివన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. విగ్నేష్ శివన్ ఈ ప్రెస్ నోట్ లో అసలు ఏం జరిగిందో వివరించారు.

    ఇంటికి కూడా వెళ్లకుండా

    ఇంటికి కూడా వెళ్లకుండా


    తమ పెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. మహాబలిపురంలో మా వివాహం జరిగిందని, స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో పెళ్లి తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా తిరుమలకు వచ్చామని పేర్కొన్నారు. ఇక కల్యాణోత్సవం సేవలో శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని కూడా నోట్ లో పేర్కొన్నారు.

     ఫోటో షూట్ నిమిత్తం

    ఫోటో షూట్ నిమిత్తం


    తిరుమలతో ఉన్న అనుబంధం రీత్యా మా పెళ్లి తిరుమలలో పూర్తయినట్లు అనిపించేలా ఫోటో తీసుకోవాలని అనుకున్నామని, అయితే ఆ సమయానికి మమ్మల్ని చూసేందుకు జనం అధిక సంఖ్యలో రావడంతో శ్రీవారి ఆలయం వద్ద నుండి వెళ్ళిపోయామని అన్నారు. ఇక ఈ క్రమంలోనే మరో సారి శ్రీవారి ఆలయం వద్దకు ఫోటో షూట్ నిమిత్తం రావడం జరిగిందని అన్నారు.

    కావాలని చేసింది కాదు

    కావాలని చేసింది కాదు


    అలా రెండవసారి వచ్చే కంగారులో పాదరక్షలు ధరించి రావడం జరిగిందన్న విగ్నేష్, ఇది కావాలని చేసింది కాదని, అయినా పొరపాటున జరిగింది కాబట్టి మనస్ఫూర్తిగా మేమిద్దరం క్షమాపణ కోరుతున్నమని అన్నారు. మా పెళ్లి ఏర్పాట్ల కోసం గత 30 రోజుల్లో ఐదుసార్లు తిరుమలకు రావడం జరిగింది కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. మేము ఎంతగానో ప్రేమించే స్వామి వారిపై భక్తి లేకుండా ఇలా జరగలేదని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు మేము క్షమాపణలు చెప్తున్నాము" అని ఆయన నోట్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో టీటీడీ ఎలా స్పందినచనుంది అనేది చూడాల్సి ఉంది.

    English summary
    Vignesh shivan tenders apology after Nayanthara wearing footwear at Tirumala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X