హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార దంపతులు..ప్రైవేట్ పిక్స్ బయటకు!

చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలిన స్టార్ హీరోయిన్ నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ఈ నెల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం జరిగిన మరుసటి రోజే వివాదంలో చిక్కుకున్న ఈ జంట గత కొంత కాలంగా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు.. అయితే తాజాగా వారు హనీమూన్ కి వెళ్ళారని తెలుస్తోంది దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తొలుత ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకున్నా కానీ ఇప్పుడు ఫోటోలు కూడా వాళ్ళే బయటకు వదిలారు అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

సౌత్ లేడీ సూపర్ స్టార్

సౌత్ లేడీ సూపర్ స్టార్

కేరళలో పుట్టి పెరిగిన నయనతార సినీ రంగ ప్రవేశం చేసి సౌత్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే తొలుత తమిళ స్టార్ హీరో శింబుతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన ఆమె అతనిని వివాహం చేసుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో వారు విడిపోయారు.

మహాబలిపురంలో వివాహం

మహాబలిపురంలో వివాహం

తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడిన ఆమె అతని కోసం మతం కూడా మార్చుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ప్రభుదేవాతో కూడా ఆమె ఏడు అడుగులు వేయలేదు. అనూహ్యంగా తనతో ఒక సినిమా చేసిన విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార చాలా సంవత్సరాలుగా అతనితో సహజీవనం చేస్తోందని అంటున్నారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9వ తేదీన మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు.

వివాదాల్లో చిక్కుకుని

వివాదాల్లో చిక్కుకుని

ఇక ఆ వివాహం రోజునే తమిళనాడులో సుమారు లక్ష మంది నిర్భాగ్యులకు విందుభోజనం ఏర్పాటు చేసి చర్చనీయాంశంగా మారారు. వివాహం జరిగిన వెంటనే అక్కడి నుంచి తిరుమలకు వచ్చిన ఈ జంట అనూహ్య రీతిలో వివాదాల్లో చిక్కుకుంది. ఇక ఆ తర్వాత వీరికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రానీయలేదు.

బ్యాంకాక్ లగ్జరీ హోటల్లో

బ్యాంకాక్ లగ్జరీ హోటల్లో

తాజాగా వీరిద్దరూ హనీమూన్ కోసం బ్యాంకాక్ వెళ్ళినట్లు విఘ్నేష్ శివన్ ద్వారా సోషల్ మీడియాలో వెల్లడైంది. ఇద్దరూ థాయ్లాండ్ లోని బ్యాంకాక్ లగ్జరీ హోటల్లో దిగగా, అందులో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో నయనతార ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకుని ఎంత క్యూట్ గా కనిపిస్తూ ఉంటే విగ్నేష్ మాత్రం క్యాజువల్స్ లో కనిపిస్తున్నారు. ఇక విగ్నేష్ నయనతారను ముద్దాడుతూ కనిపిస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో హనీమూన్ అనగానే సినీ జంటలు మాల్దీవులకు వెళుతుంటే వీరు మాత్రం బ్యాంకాక్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

మరికొన్ని రోజుల పాటు బ్యాంకాక్ లోనే గడనున్న ఈ జంట తరువాత చెన్నై చేరబోతున్నారు. చెన్నై చేరుకున్న తర్వాత ఎవరి సినిమా షూటింగ్ లలో వారు బిజీ కాబోతున్నారు. వివాహం తర్వాత గ్లామరస్ పాత్రలలో నటించబోయే ప్రసక్తే లేదని నయనతార తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయం మీద మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు.. ఏదేమైనా విగ్నేష్ శివన్-నయనతారకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X