నయనతారతో పెళ్లిపై విఘ్నేష్ షాకింగ్ కామెంట్స్: మనీ కోసమే ఆ నిర్ణయం.. ఆలస్యం వెనుక అసలు రహస్యం ఇదే!

సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం సాగిస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిన జంటల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార.. విఘ్నేష్ శివన్ జోడీ ఒకటి. అప్పుడెప్పుడో మొదలైన వీళ్ల బంధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు వీళ్లిద్దరి పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ.. అవి పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. దీంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేది ఎప్పుడన్నది సస్పెన్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా నయన్‌తో పెళ్లి గురించి విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఈ మేరకు దీనిపై అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలేంటో మీరూ చూడండి!

ఆ మూవీ టైమ్‌లో ప్రేమలో పడ్డారు

ఆ మూవీ టైమ్‌లో ప్రేమలో పడ్డారు

అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది నయనతార. అదే సమయంలో విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు విఘ్నేష్ శివన్. వీళ్లిద్దరూ కలిసి 'నానుమ్ రౌడీ దాన్' అనే మూవీ చేశారు. ఆ సమయంలో ఈ హీరోయిన్ డైరెక్టర్ మధ్య స్నేహం పెరిగి.. ఆ తర్వాత ప్రేమ చిగురించింది.

అప్పట్లో సీక్రెట్‌గా.. తర్వాత పబ్లిక్‌గా

అప్పట్లో సీక్రెట్‌గా.. తర్వాత పబ్లిక్‌గా

నయనతార.. విఘ్నేష్ శివన్ చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. పలుమార్లు కెమెరాల కంట పడ్డా దీనిపై నోరు మెదపలేదు. కానీ, కొద్ది రోజుల క్రితం తమ ప్రేమను ప్రకటించారు. తమ బంధం బయట పడినప్పటి నుంచి మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడంతో పాటు దేవాలయాలను సైతం సందర్శిస్తూ పబ్లిక్ అయిపోయారు.

పెళ్లి విషయంలో పుకార్లు.. డౌట్లతో

పెళ్లి విషయంలో పుకార్లు.. డౌట్లతో

దాదాపు మూడేళ్లుగా నయనతార.. విఘ్నేష్ శివన్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో ఆ నెలలో పెళ్లి చేసుకుంటారు.. ఈ నెలలో ఒక్కటవబోతున్నారు.. అంటూ ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కానీ, ఇది మాత్రం జరగకపోవడంతో అసలు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. దీంతో ఫ్యాన్స్ క్లారిటీ కోరుతున్నారు.

ఎంగేజ్‌మెంట్ రింగ్.. పెళ్లిపై వార్తలు

ఎంగేజ్‌మెంట్ రింగ్.. పెళ్లిపై వార్తలు

చాలా కాలంగా నయనతార పెళ్లి హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో నయన్ అతడిపై చేయి వేసి హత్తుకుని కనిపిస్తోంది. అంతేకాదు, ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కూడా ఉంది. దీనికితోడు అదే అర్థం వచ్చేలా విఘ్నేష్ క్యాప్షన్ కూడా పెట్టడంతో వీళ్లిద్దరికి నిశ్చితార్థం అయిందని అంతా అనుకున్నారు.

పెళ్లి గురించి విఘ్నేష్ క్లారిటీ ఇలా

పెళ్లి గురించి విఘ్నేష్ క్లారిటీ ఇలా

విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే నిత్యం ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలను పంచుకుంటుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా చాలా మంది నయన్ గురించి అతడిని ప్రశ్నలు అడిగారు. అదే సమయంలో పెళ్లి గురించి కూడా పలు రకాలుగా ప్రశ్నించారు.

మనీ కోసమే ఆ నిర్ణయం అంటూ

మనీ కోసమే ఆ నిర్ణయం అంటూ

తాజా సెషన్‌లో ఓ నెటిజన్ 'మీరు ఎందుకని నయనతార మేడమ్‌ను ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు? దాని కోసం మేమంతా వేచి చూస్తున్నాం' అని ప్రశ్నించారు. దీనిపై విఘ్నేష్ శివన్ స్పందిస్తూ 'పెళ్లి దాని తర్వాత జరిగేవన్నీ చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నవి బ్రదర్. అందుకే చాలా రోజులుగా మనీ సేవ్ చేసుకుంటున్నాం' అని ఊహించని విధంగా సమాధానం చెప్పాడీ యంగ్ డైరెక్టర్.

ఆలస్యం వెనుక అసలు రహస్యం

ఆలస్యం వెనుక అసలు రహస్యం

అంతేకాదు, తమ పెళ్లి ఆలస్యం అవడానికి డబ్బే అసలు కారణంగా చెప్పిన విఘ్నేష్.. అందులోనే మరో రీజన్ కూడా చెప్పాడు. 'కరోనా ఎప్పుడు వెళ్లిపోతుందా అని వేచి చూస్తున్నాం' అని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ సారి కోవిడ్ తగ్గిన వెంటనే పెళ్లి చేసుకుంటాం అని పరోక్షంగా వెల్లడించాడు. విఘ్నేష్ ఇచ్చిన క్లారిటీతో నయనతార అభిమానులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X