నయనతారతో పెళ్లిపై పెదవి విప్పిన విగ్నేష్ శివన్.. తిరుపతిలో అందుకే క్యాన్సిల్..ఆరోజే మీ ముందుకొస్తామంటూ!

గత కొద్ది రోజులుగా నయనతార విఘ్నేష్ శివన్ వివాహానికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ విషయం మీద ఈ జంట ఇప్పటి వరకు నోరు విప్పిన దాఖలాలు లేవు.. తాజాగా తమ వివాహం గురించి విఘ్నేష్ శివన్ తమిళ మీడియాతో మాట్లాడారు. తమ వివాహ వేదిక, తమ వివాహం ఎప్పుడు జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత ఏం చేయబోతున్నారు అనే విషయాల మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

విఘ్నేష్ శివన్ తో

విఘ్నేష్ శివన్ తో

సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకున్న నయనతార గతంలో ఎంతో మందితో ప్రేమాయణం నడిపింది. అయితే అనూహ్యంగా ఎవరితోనూ ఆమె వివాహబంధం వరకు వెళ్లలేదు. నేను రౌడీ నే అనే సినిమా చేసిన సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో పడింది. వీరి వివాహానికి సంబంధించి గతంలో చాలా ప్రచారాలు జరిగాయి. వీరికి రహస్యంగా వివాహం జరిగిపోయిందని కొందరు, వివాహం చేసుకోకుండానే జీవితాంతం కలిసి ఉంటారని కొందరు ఇలా రకరకాల ప్రచారాలు చేశారు.

అధికారిక ప్రకటన

అధికారిక ప్రకటన

అయితే ఆ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా వీరిద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. గత నెలలో వీరిద్దరూ కూడా తిరుమలలో పర్యటించిన క్రమంలో వీరు తిరుమలలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెబుతూ వార్తలు వచ్చాయి. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసిన ఈ జంట తమ వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఇలా మీడియాలో వార్తలు రావడం తప్పితే వీరి వివాహానికి సంబంధించి ఇప్పటివరకు వీరిద్దరి తరపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ క్లారిటీ కానీ రాలేదు.

సన్నిహితులు, స్నేహితులు మాత్రమే

సన్నిహితులు, స్నేహితులు మాత్రమే

తాజాగా ఈ విషయం మీద విఘ్నేష్ శివన్ స్పందించాడు. తాను తన ప్రేయసి నయనతారను పెళ్లి చేసుకోబోతున్నాం అని జూన్ 9 గురువారం నాడు నయనతారను మహాబలిపురంలో పెళ్లిచేసుకోబోతున్నా అని ప్రకటించారు. అంతేకాక కరోనా కేసుల దృష్ట్యా మా వివాహానికి ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

 మహాబలిపురానికి

మహాబలిపురానికి

అయితే తొలుత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము కానీ తిరుమలకు సెలబ్రిటీలు రావడం అనేది కాస్త ఇబ్బందికర అంశం అని భావించి వారికి ప్రయాణం కష్టం అవుతుందని సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఏర్పడడంతో పెళ్లి వేడుకను మహాబలిపురానికి మార్చామని విగ్నేష్ చెప్పుకొచ్చారు. జూన్ 9 ఉదయం పెళ్లి జరుగుతుందని మధ్యాహ్నానికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మీకు షేర్ చేస్తామని ఆయన ప్రకటించారు.

జూన్ 11న తాను నయనతార కలిసి ముందుకు వచ్చి అందరినీ ప్రత్యేకంగా కలుస్తామని పేర్కొన్నారు. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలంటూ ఆయన కోరినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక నయనతార వివాహానికి మాజీ ప్రియులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ విషయం మీద ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక క్లారిటీ ఏదీ బయటకు రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X