అవన్నీ పుకార్లే.. నెట్ ఫ్లిక్స్ ఎంట్రీకి సిద్దమైన విగ్నేష్-నయన్!

నయనతార, విగ్నేష్ శివన్ వివాహం అంగరంగ వైభవంగా కొన్నాళ్ల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం జరగకముందే వీరి వివాహాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుక్కుందని వీరి వివాహ హక్కులను కొనుక్కోవడంతో వీరి వివాహానికి సంబంధించిన వీడియో నెట్ ఫ్లిక్స్ లో కనిపించబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎట్టకేలకు అదే నిజమైంది. నెట్ ఫిక్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 వివాహం చేసుకుంటారని

వివాహం చేసుకుంటారని

మలయాళ భామ నయనతార తన సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే తొలుత హీరో శింబుతో ప్రేమలో పడిన ఆమె ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమలో పడింది. వీరిద్దరితో కూడా వివాహం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అది వివాహం వరకు వెళ్లలేదు. వారిద్దరి నుంచి విడిపోయిన ఆమె తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది, వీరిద్దరు కూడా వివాహం చేసుకుంటారని భావించారు.

డౌటే అని

డౌటే అని


నీ సుమారు ఏడేళ్ల పాటు సహజీవనం చేయడంతో వీరు కూడా వివాహం చేసుకోవడం డౌటే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది జూన్ నెలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ముందుగా తిరుమలలో వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ వారి వివాహానికి ముఖ్య అతిథులుగా కొంతమంది వీఐపీలు రావాల్సి ఉండడంతో వారంతా తిరుమల రావడం కష్టమని భావించి చెన్నై సమీపంలోని మహాబలేశ్వరం అనే ప్రాంతంలో ఒక గ్రాండ్ హోటల్ లో వివాహం చేసుకున్నారు.

 అగ్రిమెంట్ కి విరుద్ధం

అగ్రిమెంట్ కి విరుద్ధం


అయితే వీరి వివాహానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు వీడియోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం నయనతార భర్త షేర్ చేసిన కొన్ని ఫోటోలు తప్ప వీరు వివాహానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులు కొనుక్కోవడంతోనే ఇంత పకడ్బందీగా ఉందని చాలామంది భావించారు. అయితే కొన్నాళ్ల తర్వాత నయనతార భర్త కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో ఈ విషయం మీద నయనతారతో నెట్ ఫ్లిక్స్ సంస్థ సమావేశం అయిందని, ఇలా ఫోటోలు షేర్ చేయడం అగ్రిమెంట్ కి విరుద్ధం అంటూ వారితో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది.

 నెట్ ఫ్లిక్స్ లోకి

నెట్ ఫ్లిక్స్ లోకి


సుమారు 15 కోట్ల రూపాయల మేర తిరిగి నయనతార దంపతులు చెల్లించాల్సి వచ్చిందంటూ రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార విగ్నేష్ శివన్ కి సంబంధించిన కొన్ని ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్ ఫోటోలు షేర్ చేసి మీరు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్నారు అంటూ ప్రకటించింది.

 ప్రసారం చేయబోతోంది

ప్రసారం చేయబోతోంది


అయితే కొంతమంది నెట్ ఫ్లిక్స్ కు నయనతార దంపతులకు మధ్య ఎలాంటి ఇబ్బంది లేదని అదంతా కేవలం మీడియా సృష్టినని అంటుంటే మరి కొందరు మాత్రం 10 కోట్ల రూపాయల మేర ఖర్చుపెట్టిన నేపథ్యంలో ఆ డబ్బులు వరకు హక్కులు తమ దగ్గరే ఉంచుకొని ఆ వీడియోలను ఇప్పుడు ప్రసారం చేయబోతోంది అంటూ చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయి అనేది మాత్రం తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X