ప్రియుడితో నయనతార బ్రేకప్.. ఆ ఇద్దరి రియాక్షన్ ఏంటంటే!
సౌత్ ఇండియన్ క్రేజీ జోడీ నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి అందరికీ తెలుసు. గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని, వారి ప్రేమ విఫలమైందని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఇదే న్యూస్ షికారు చేస్తోంది.
పెళ్లి వార్తను త్వరలో చెబుతారని భావిస్తున్న తరుణంలో బ్రేకప్ వార్త హల్చల్ చేయడంతో అంతా షాకయ్యారు. అయితే ఈ ప్రచారానికి నయనతార పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తను విఘ్నేష్‌తో సంతోషంగా ఉన్నట్టు ఆమె తెలిపింది.

మరోవైపు విఘ్నేష్ శివన్ కూడా దీనిపై స్పందిస్తూ ఆమెతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టారు. ఇలా నయన్, విఘ్నేష్ ఇద్దరూ దీనిపై స్పష్టత ఇచ్చారు కాబట్టి ఇక ఈ బ్రేకప్ వార్తలకు బ్రేక్ ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.
నయనతార సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే రజనీకాంత్‌తో సరసం 'దర్బార్'. సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాదిందింది. ఈ చిత్ర ప్రచారంలో నయనతార ఎక్కడా కనిపించలేదు. సినిమా ప్రమోషన్‌కు రాకపోవడం ఆమెకు అలవాటే అయినప్పటికీ, రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ సినిమాకు సైతం ఇలా చేయడం పట్ల రజినీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేస్తోంది నయనతార.


Click it and Unblock the Notifications











