నయనతో పెళ్ళా అదేంటీ..!?: నయన్ తో ప్రేమపై నోరు విప్పిన విఘ్నేష్

నయన తార పాపులర్ హీరోయిన్ గా ఎంత పాపులరో, తన ఎఫైర్లూ, వివాదాల కారణంగా కూదా అంతే పాపులర్ కనీసం ఏడాదిలో ఒకటైమ్నా వివాదం నయన పేరుతో వినిపిస్తుంది.

నయన తార పాపులర్ హీరోయిన్ గా ఎంత పాపులరో, తన ఎఫైర్లూ, వివాదాల కారణంగా కూదా అంతే పాపులర్ కనీసం ఏడాదిలో ఒకటైమ్నా వివాదం నయన పేరుతో వినిపిస్తుంది. ఇప్పటికే రకరకాల ఎఫైర్లతో విసిగిపోయిన నయన తార శింబు, ప్రభుదేవాల తర్వాత తమిళ యువ దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో పడిందనే వార్త చాలా కాలం గానే వినిపిస్తోంది.. అయితే ఇదే విషయం మీద విఘ్నేష్ ఏం చెప్పాడంటే...

శింబు, ప్రభుదేవా, విఘ్నేష్ శివన్

శింబు, ప్రభుదేవా, విఘ్నేష్ శివన్

నయనతార.. ఎప్పుడూ ఏదో ఒక‌ లవ్‌ఎఫైర్‌తో లైమ్ లైట్‌లో ఉంటోంది. మొదట్లో తమిళ హీరో శింబు, ఆ తర్వాత నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఇప్పుడు తమిళ యువ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఇలా నయనతార ప్రేమాయణాలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ పెళ్ళి ఎప్పుడు, ఎవరితో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

మూడేళ్లుగా ప్రేమ

మూడేళ్లుగా ప్రేమ

ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉందనే విషయం ఇప్పటికి చాలాసార్లే నిరూపితమైంది. గతేడాది ఓనమ్ పండుగకు నయన్ ఇంట్లో విఘ్నేష్ గడిపితే.. సంక్రాంతి పండుగను ఇద్దరూ కలిసి తెగ సంబరంగా చేసేసుకున్నారు. ఇద్దరూ కలిసి మూడేళ్లుగా ప్రేమాయణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మరి ఇంత సుదీర్ఘ కాలం లవ్వాడుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యానికి వచ్చి ఉంటారని అంతా భావించారు.

రహస్య వివాహం

రహస్య వివాహం

అయితే ఉన్నట్టుందీ కొన్ని రోజుల క్రితం విఘ్నేష్ శివన్, నయన్ రహస్య వివాహం చేసుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొచ్చిలోని ఓ చర్చిలో వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిందని ఆ వార్తల సారాంశం. ప్రముఖ మీడియా సంస్థల్లో ఈ వార్తలు రావడంతో అంతా నిజమే అనుకున్నారు.

నానుమ్ రౌడీదాన్

నానుమ్ రౌడీదాన్

నయనతార ప్రస్తుతం ధనుష్ నిర్మిస్తున్న ‘నానుమ్ రౌడీదాన్' చిత్రంలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరో. ఈచిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. విఘ్నేష్ శివన్ తో నయనతార సన్నిహితంగా మెలుగుతున్నారని, ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో గడిపి వచ్చినట్లు కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి.

పెళ్లి జరిగిపోయిందంటూ వార్తలు

పెళ్లి జరిగిపోయిందంటూ వార్తలు

అతనికి ఓ ఖరీదైన కారు గిఫ్టుగా కొనిచ్చిందని టాక్. ఇపుడు ఏకంగా పెళ్లి జరిగిపోయిందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విఘ్నేష్ శివన్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు తెరపడినట్లయింది. ఇంతకీ విఘ్నేష్ ఏం చెప్పాడూ అంతే...నయనతో మీ పెళ్లి ఎప్పుడు అని లేటెస్ట్ గా ఒక ప్రెస్ మీట్ లో విఘ్నేశ్ ను అడిగారు.

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

త‌న దృష్టాంతా కూడా కెరియర్ పైనే ఉందనీ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అతను జవాబిచ్చాడు. అప్పుడే పెళ్లేంటీ.. ప్రస్తుతం కెరీర్ పై ఫుల్లుగా ఫోకస్ చేశానంతే అంటూ మాట దాటేశాడు. మరి నయనతార రెస్పాన్స్ ఏంటో తెలీదు. కానీ పెళ్లి చేసుకోకపోయినా.. దాదాపుగా సహజీవనం చేస్తున్నారని.. ఫారిన్ ట్రిప్పులు లాంటివన్నీ కలిసే కంప్లీట్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X