twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది మీ కోసమే మహేష్ గారు.. ప్రేమతో దళపతి విజయ్!!

    |

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టాలీవుడ్‌లో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతమవ్వగా.. ఈ మధ్యే మూడో దశ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రభాస్ చేత ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి ఈ సవాల్ అలా కొనసాగుతూ దూసుకుపోతూనే ఉంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన పుట్టిన రోజున మొక్కలను నాటాడు.

    బర్త్ డే రోజు మహేష్ బాబు మొక్కలు నాటుతు.. 'ఇంతకంటే గొప్పగా నా బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకోలేను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎన్టీఆర్, విజయ్, శ్రుతీ హాసన్‌లకు పాస్ చేస్తున్నాను. ఈ పరంపరను కొనసాగించాలి. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరంతా సహకరించాలి. పచ్చని ప్రపంచం కోసం ముందడగు వేద్దామ'ని పేర్కొన్నాడు. తాజాగా ఈ మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను విజయ్ స్వీకరించాడు.

    Vijay Accepts Mahesh Babu Green India Challenge
    Vijay Accepts Mahesh Babu Green India Challenge

    దళపతి విజయ్ మహేష్ ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటి ఆవరణలోనే మొక్కను నాటాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. మహేష్ బాబు గారు ఇది మీ కోసమే.. మంచి ఆరోగ్యం పచ్చని భారతదేశం రావాలి.. థ్యాంక్యూ సురక్షితంగా ఉండండ'ని ట్వీట్ చేశాడు. ఇక ఈ మేరకు విజయ్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ చేసిన ట్వీట్‌కు మహేష్ బాబు స్పందిస్తూ.. 'ఈ ఛాలెంజ్‌ను తీసుకుని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్స్ బ్రదర్.. సురక్షితంగా ఉండండ'ని తెలిపాడు.

    Vijay Accepts Mahesh Babu Green India Challenge

    English summary
    Vijay Accepts Mahesh Babu Green India Challenge. This is for you urstrulyMahesh garu. Here’s to a Greener India and Good health. Thank you #StaySafe
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X