Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఇది మీ కోసమే మహేష్ గారు.. ప్రేమతో దళపతి విజయ్!!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టాలీవుడ్లో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతమవ్వగా.. ఈ మధ్యే మూడో దశ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రభాస్ చేత ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి ఈ సవాల్ అలా కొనసాగుతూ దూసుకుపోతూనే ఉంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన పుట్టిన రోజున మొక్కలను నాటాడు.
బర్త్ డే రోజు మహేష్ బాబు మొక్కలు నాటుతు.. 'ఇంతకంటే గొప్పగా నా బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకోలేను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎన్టీఆర్, విజయ్, శ్రుతీ హాసన్‌లకు పాస్ చేస్తున్నాను. ఈ పరంపరను కొనసాగించాలి. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరంతా సహకరించాలి. పచ్చని ప్రపంచం కోసం ముందడగు వేద్దామ'ని పేర్కొన్నాడు. తాజాగా ఈ మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను విజయ్ స్వీకరించాడు.
దళపతి విజయ్ మహేష్ ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటి ఆవరణలోనే మొక్కను నాటాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. మహేష్ బాబు గారు ఇది మీ కోసమే.. మంచి ఆరోగ్యం పచ్చని భారతదేశం రావాలి.. థ్యాంక్యూ సురక్షితంగా ఉండండ'ని ట్వీట్ చేశాడు. ఇక ఈ మేరకు విజయ్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ చేసిన ట్వీట్‌కు మహేష్ బాబు స్పందిస్తూ.. 'ఈ ఛాలెంజ్‌ను తీసుకుని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్స్ బ్రదర్.. సురక్షితంగా ఉండండ'ని తెలిపాడు.