Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విజయ్ ఆంటోనీ ‘రోషగాడు’ మోషన్ పోస్టర్
'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ టాలీవుడ్లో తన సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అయితే 'బిచ్చగాడు' తర్వాత వచ్చిన విజయ్ ఆంటోనీ సినిమాలేవీ తెలుగు బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. అయితే వరుస సినిమాలు చేస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.
విజయ్ ఆంటోని తాజాగా తమిళంలో నటిస్తున్న 'తిమిరపుడిచవాన్' అనే చిత్రం తెలుగులో 'రోషగాడు' పేరుతో విడుదల కాబోతోంది. తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. కుమారస్వామి అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నివేథా పేతురాజ్ హీరొయిన్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
తాజాగా విడుదలైన మోషనల్ పోస్టర్లో ''ఒళ్లంతా పొగరురా... పొగరుకె మొగుడురా... మొగుడురా పొగరుకే.. పడడు మాట రోషగాడు రా..' అంటూ లిరిక్స్ ఉండటాన్ని బట్టి హీరో క్యారెక్టర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రై.లి, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుతోంది. ఈ చిత్రానికి కథ, మాటలు, డైలాగ్స్, దర్శకత్వం గణేషా. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.