twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ ఆంటోనీ ‘రోషగాడు’ మోషన్ పోస్టర్

    By Bojja Kumar
    |

    'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ టాలీవుడ్లో తన సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అయితే 'బిచ్చగాడు' తర్వాత వచ్చిన విజయ్ ఆంటోనీ సినిమాలేవీ తెలుగు బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. అయితే వరుస సినిమాలు చేస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

    విజయ్ ఆంటోని తాజాగా తమిళంలో నటిస్తున్న 'తిమిరపుడిచవాన్' అనే చిత్రం తెలుగులో 'రోషగాడు' పేరుతో విడుదల కాబోతోంది. తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. కుమారస్వామి అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

    యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నివేథా పేతురాజ్ హీరొయిన్‌. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

    తాజాగా విడుదలైన మోషనల్ పోస్టర్లో ''ఒళ్లంతా పొగరురా... పొగరుకె మొగుడురా... మొగుడురా పొగరుకే.. పడడు మాట రోషగాడు రా..' అంటూ లిరిక్స్ ఉండటాన్ని బట్టి హీరో క్యారెక్టర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

    Vijay Antonys ‘Roshagadu’ Motion Poster

    విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రై.లి, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుతోంది. ఈ చిత్రానికి కథ, మాటలు, డైలాగ్స్, దర్శకత్వం గణేషా. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

    English summary
    Vijay Antony's ‘Roshagadu’ Motion Poster Released. Music director-turned actor Vijay Antony will be seen as a dashing cop in upcoming Telugu movie, ‘Roshagadu’. The bilingual flick will appear in Tamil as ‘Thimiru Pudichavan.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X