సంచలన బయోపిక్‌లో విజయ్ ఆంటోని.. బిచ్చగాడిని మించే పాత్రలో..

నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని సంచలనాత్మక బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

By Rajababu

Recommended Video

బిచ్చగాడిని మించే పాత్రలో.. విజయ్ ఆంటోని

నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని సంచలనాత్మక బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రంలో నటించడానికి విజయ్ ఆంటోని సిద్ధమవుతున్నాడు. బిచ్చగాడు లాంటి విభిన్న చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చే విజయ్ తాజాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారనే వార్త కోలివుడ్‌లో చర్చనీయాంశమైంది.

 కీలకపాత్రలో విజయ్ ఆంటోని

కీలకపాత్రలో విజయ్ ఆంటోని

సామాజిక కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో విజయ్ ఆంటోని ఓ కీలక పాత్రను పోషిస్తున్నారనేది కోలీవుడ్ సమాచారం. యువకుడిగా ఉండే ట్రాఫిక్ రామస్వామి పాత్రను విజయ్ ఆంటోని పోషించనున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. సమాజంలో ఎదురైన సమస్యలను ట్రాఫిక్ రామస్వామి ఎలా ఎదిరించాడనేది సినిమా కథాంశం.

 ఎస్ఏ చంద్రశేఖర్ కూడా

ఎస్ఏ చంద్రశేఖర్ కూడా

ట్రాఫిక్ రామస్వామి క్రేజీ ప్రాజెక్ట్‌లో సీనియర్ దర్శకుడు, నటుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ వృద్ధ ట్రాఫిక్ రామస్వామి పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు భార్యగా రోహిణి నటించనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఇంకా ఈ చిత్రంలో ఆర్కే సురేశ్, ఉపాసన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీనియర్ నటి అంబిక చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ తెర మీద కనిపించనుండటం ఈ సినిమాకు మరో ప్రత్యేకత.

సాంకేతిక వర్గం వీరే

సాంకేతిక వర్గం వీరే

ఈ చిత్రానికి బాల మురళి బాలు సంగీతం అందించనుండగా, గుగన్ సినిమాటోగ్రఫీ, ప్రభాకర్ ఎడిటింగ్, ఏ వనరాజ్ ఆర్ట్, అంబరివ్ స్టంట్లు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ చిత్రాన్ని ఈరోడ్ మోహన్ నిర్మిస్తున్నారు.

 ఇంద్రసేన ఆడియో రిలీజ్

ఇంద్రసేన ఆడియో రిలీజ్

ప్రస్తుతం కొత్త దర్శకుడు శ్రీనివాసన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న అన్నాదురై (ఇంద్రసేన) చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విజయ్ ఆంటోని బిజీగా ఉన్నారు. ఇంద్రసేన ఆడియో రిలీజ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని కవల సోదరుల పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధిక, విజయ్ ఆంటోని భార్య ఫాతిమా సంయుక్తంగా నిర్మిస్తు్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X