Bichagadu 2 Twitter Review: బిచ్చగాడు 2కు టాక్ ఇలా.. ఆ 20 నిమిషాలు కేక.. ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా?
గతంలో కంటే ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీల్లోనూ సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. ఇలా ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు 2016లో వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'బిచ్చగాడు' సినిమాకు సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'ను తెరకెక్కించాడు హీరో కమ్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన 'బిచ్చగాడు 2' ట్విట్టర్ రివ్యూను చూద్దామా!
మరోసారి వచ్చిన 'బిచ్చగాడు':
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'బిచ్చగాడు 2'. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని కూడా సమకూర్చాడు.

అలాంటి కథ.. కమర్షియల్‌గానే:
విజయ్ గురుమూర్తి అనే పేరున్న బిజినెస్‌మ్యాన్ ఓ ప్రమాదంలో చనిపోయాడని ప్రచారం జరగడం.. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత గురుమూర్తి గురించి నిజాలు తెలియడం అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో 'బిచ్చగాడు 2' సినిమా రూపొందింది. ఇందులో ఎన్నో కమర్షియల్ హంగులు, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను పెట్టి ప్రతిష్టాత్మకంగా తీశారు.
ఫస్టాఫ్ బాగుంది అంటూ:
విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు 2'ను చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో 'విజయ్ ఆంటోనీ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ మంచి ఆసక్తితో సాగింది. ఇప్పుడు సెకెండాఫ్ ఎలా మొదలు అవుతుందో ఊహించడానికి లేకుండా పోయింది' అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.
ఆ 20 నిమిషాలు కేక అంటూ:
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీని చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో స్పందించాడు. ఈ మేరకు అతడు 'సినిమా మొదలై 50 నిమిషాలు అయిపోయింది. మొదటి 20 నిమిషాలు అద్భుతంగా ఉంటే.. మిగతాదంతా ఫ్లాట్‌గా సాగిపోయింది. ఇప్పుడైతే చాలా బోరింగ్‌గా ఉంది' అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు.
చూడదగిన సినిమానే అని:
'బిచ్చగాడు 2' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయం చెప్పాడు. అతడు చేసిన ట్వీట్‌లో 'బిచ్చగాడు 2 చూడదగిన సినిమానే. ఇందులో విజయ్ ఆంటోనీ వన్ మ్యాన్ షో చేశాడు. కొత్త పాయింట్ లేకుండా రొటీన్ ఫ్లాట్‌తోనే ఇది సాగిపోతుంది. ఇది సీక్వెల్ కాబట్టి మంచి కథనం కోసం ఇంకాస్త సమయం తీసుకుంటే బాగుండేది' అంటూ చెప్పుకొచ్చాడు.
సెకెండాఫ్ ఇలా ఉందంటూ
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'బిచ్చగాడు 2' మూవీలో ఫస్టాఫ్ కాస్త ఎంగేజింగ్‌గానే ఉన్నప్పటికీ రెండో సగం మాత్రం ఆశించిన రీతిలో లేదని కొందరు ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇందులో స్టోరీ పెద్దగా లేకపోవడం.. రొటీన్ సీన్స్ ఉండడం మైనస్‌గా మారిందని చెప్తున్నారు. అలాగే, ఎమోషన్స్ బలంగా లేవని కూడా అంటున్నారు.
ఓవరాల్‌గా ఎలా ఉందంటే
ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు 2' మూవీకి మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. ఇందులో మొత్తంగా మొదటి 20 నిమిషాలు మాత్రం హై లెవెల్‌లో ఉందని చెప్తున్నారు. కానీ, మిగిలిన భాగం మొత్తం రొటీన్‌గా సాగిపోతోందని అంటున్నారు. అయితే, ఈ సినిమాను మాత్రం ఒకసారి కచ్చితంగా చూడొచ్చిన వీక్షకులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











