twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క 'పులి వేట' మొదలెట్టేది ఎప్పుడు?

    By Srikanya
    |

    అనూష్క కి తెలుగునాట ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు తమిళంలో ప్లాప్ అయిన చిత్రాలను ఇక్కడ డబ్బింగ్ చేసి తోయటం మొదలెడుతున్నారు. అందులో భాగంగానే విజయ్ తో ఆమె నటించిన వేటైకారన్ చిత్రాన్ని అనువాదం చేసి వదులుతున్నారు.ఫస్ట్ కాపీ వచ్చిన ఈ చిత్రం ఈమధ్యనే సెన్సార్ పూర్తి చేసుకుంది. 300 ప్రింట్లతో మార్చి 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సర్వసన్నాహాలను చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత యం.వి.గోపాలరావు మాట్లాడుతూ..

    ప్రజలను అక్రమంగా దోచుకుంటూ బెంబేలెత్తిస్తున్న రౌడీమూకను అరికట్టేందుకు ఎవరు ఎన్నివిధాలుగా ప్రయత్నం చేసినా ఏదీ సక్రమంగా సాగకపోవడంతో పులిలాంటి ఓ యువకుడు సాహసంతో హింసకు హింసే సరైన మార్గమని ఆ దోవలో సన్నాహాలు జరిపి వారి ఆటల్ని ఎలా అరికట్టి కటకటాల వెనక్కి పంపిస్తాడనేదే పులివేట ఇతివృత్తం అన్నారు. విజయ్ అనుష్క జంటగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, జీవా, రవి, షియాజీ షిండే, గౌస్ మున్నగువారు ఇతర ప్రధానపాత్రల్ని పోషించారు. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలను సమకూర్చిన ఈ చిత్రానికి భువనచంద్ర పాటలు రాశారు.

    English summary
    Vijay, Anushka starrer 'Vettaikaran' film is being dubbed into Telugu as 'Puli Veta'. Film Makers announced that film will hit screens on 24th March with 300 Prints all over the world in Telugu verison it seems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X