Beast Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. రిలీజ్ రోజే భారీ దెబ్బ.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!
దక్షిణాది హీరోలతో పోలిస్తే.. సుదీర్ఘ కాలంగా తన ప్రత్యేకతను చాటుకుంటూ టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్. విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు.. అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు. ఇక, కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతోన్న విజయ్.. గత ఏడాది 'మాస్టర్' అనే మూవీతో భారీ సక్సెస్‌ను చూశాడు.
ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'బీస్ట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఊహించని విధంగా టాక్ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి.

‘బీస్ట్' అంటూ వచ్చేసిన విజయ్
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రమే 'బీస్ట్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీలో విజయ్ 'వీర రాఘవన్' పాత్రలో నటించాడు.

అంచనాల పెంచేసిన అప్‌డేట్స్
మాస్ అండ్ యాక్షణ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'బీస్ట్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ దక్కాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో అలరించాయి. దీంతో విజయ్ చిత్రంపై తెలుగు, తమిళంలో భారీ హైప్ క్రియేటైంది.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
విజయ్‌కు దక్షిణాది మొత్తంలో మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'బీస్ట్' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతుంది.

విజయ్ సినిమాకు అలాంటి టాక్
స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆరంభంలోనే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంత మంది మూవీ బాగుందని, కొందరు బాలేదని ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా
'బీస్ట్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం విజయ్ మాస్ ఇంట్రో సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. అలాగే, ఇందులో కామెడీ కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారని చెబుతున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం ఫస్టాఫ్‌కు భిన్నంగా ఉంటుందట. ఇందులో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్‌తోనే నడిపించారని అంటున్నారు.

సినిమాలో ప్లస్... మైనస్‌లు ఇవే
విజయ్ నటించిన 'బీస్ట్' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో హీరో నటన, క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ సీన్ బాగున్నాయట. అలాగే అరబిక్ కుతూ సాంగ్ హైలైట్‌గా ఉందట. బ్యాగ్రౌండ్ స్కోర్, కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీకి ప్లస్ అని అంటున్నారు. ఇక, కథలో కొత్తదనం లేకపోవడం, లాజిక్ లేని సీన్స్, లవ్ ట్రాక్ మైనస్‌గా మారాయని టాక్.

ఫైనల్‌గా బీస్ట్ ఎలా ఉందంటే
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. విజయ్ నటించిన 'బీస్ట్' మూవీ పూర్తిగా అతడి అభిమానులను అలరించే యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇందులో మొత్తం విజయ్ వన్ మ్యాన్ షోలా చూపించాడట. మొత్తంగా ఇది అన్ని వర్గాలనూ అలరించే చిత్రమని అంటున్నారు. అయితే, అజిత్ ఫ్యాన్స్ మాత్రం దీనికి నెగెటివ్ రిపోర్టులు ఇస్తూ దెబ్బ కొడుతున్నారు.


Click it and Unblock the Notifications











