Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకటేష్, రామ్ కాంబినేషన్ కి దర్శకుడు ఖరారు
హైదరాబాద్: వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో 'బోల్ బచ్చన్' రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. తమాషా కథాంశంతో ఆద్యంతం వినోదాన్ని పంచిపెట్టిన బాలీవుడ్ చిత్రం 'బోల్ బచ్చన్'. వచ్చీ రాని ఆంగ్లంతో అజయ్ దేవగణ్, ఒక్కడే అయినా ఇద్దరిలా ప్రవర్తించే అభిషేక్ బచ్చన్ల పాత్రలు భలే నవ్వించాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో పునఃనిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజయ్, అభిషేక్‌ల పాత్రల్లో వెంకటేష్, రామ్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డి.సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయి. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్ సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు. 'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
"అవును, నేను రామ్ కలిసి బోల్ బచ్చన్ రీమేక్ ని తెలుగులో చేస్తున్నాం. సినిమా టైటిల్, దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చే సంవత్సరంలో చిత్రం ప్రారంభం అవుతుంది." అని తేల్చి చెప్పారు వెంకటేష్. గత కొద్ది రోజులుగా వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో మరో మల్టి స్టారర్ గా బోల్ బచ్చన్ రీమేక్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి కొందరు రూమర్స్ అని కొట్టిపారేసారు. అయితే తాజాగా వెంకటేష్ తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పి,రూమర్స్ ని నిజం చేసారు.