నా ఫోటో పెట్టుకుని గొడవలు పడుతున్నారు.. నాకు నచ్చడం లేదు.. విజయ్ దేవరకొండ!

Recommended Video

Vijay Devarakonda Tweets To His Fans

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రలో యూత్ ఐకాన్ గా మారుతున్నాడు. విభిన్నమైన అతడి శైలికి యువత ఆకర్షితులవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం నోటా. ఆనంద్ శంకర్ దర్శత్వంలో ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో వివిధ హీరోల అభిమానుల మధ్య జరుగుతున్న గొడవల గురించి స్పందించాడు.

 మార్పుకు కారణం కావాలి

మార్పుకు కారణం కావాలి

విజయ్ దేవరకొండ అభిమానులని ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశాడు. సినిమా విషయంలో కానీ, మన జీవన విధానంలో కాని మనం మార్పుకు కారణం కావాలి. సోషల్ మీడియాలో చెడు ప్రచారం దూరం చేయడానికి ఇదే సరైన సమయం అంటూ విజయ్ దేవరకొండ ప్రస్తావించాడు.

 గొడవలు గమనిస్తున్నా

గొడవలు గమనిస్తున్నా

చాలా మంది నాపై అభిమానంతో సోషల్ మీడియాలో డీపీలుగా నా ఫోటోలు పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. నాపై అభిమానం ఉన్నవారు చాలామంది వేరే హీరోల అభిమానులతో సోషల్ మిడియా వేదికగా గొడవలు పెట్టుకుంటున్నారు.

నాకు ఇష్టం లేదు

అలా వాదులాడుకోవడం నాకు నచ్చదు. దయచేసి మీరు కూడా అలాంటి గొడవలకు దూరంగా ఉండండి అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులకు సూచించాడు. మనపనిలో మనం నిమగ్నమైతే అది సాధ్యమే అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు.

ఎవరైనా తిట్టినా కూడా

ఎవరైనా తిట్టినా కూడా

ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళ మంచినే కాంక్షించండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ కోసం మంచి చిత్రాలు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇకపై ఎలాంటి గొడవల్లో కనిపించకండి అంటూ విజయ్ దేవరకొండ అభిమానులకు సూచించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X