twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ పెంచారా? ‘నోటా’ స్టార్ ఏమంటున్నారంటే?

    |

    పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డితో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న విజయ్ 'నోటా' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుస విజయాలు అందుుకుంటున్న ఆయన తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    తన రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తలపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు. రెమ్యూనరేషన్ పెంచాను అనే వార్తల్లో నిజం లేదు, అసలు అలాంటి ఆలోచన కూడా నాకు రాదు అని విజయ్ స్పష్టం చేశారు.

    "ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను, ఈ రోజున నాకు ఇంత గుర్తింపు వచ్చింది. ఈ స్థాయికి రావడమే నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. స్టార్ డమ్ గురించి నేను ఆలోచించడం లేదు, దాని గురించి ఆశపడటం లేదు. ఇక ప్రతి సినిమాను ఇదే నా చివరి సినిమా అనుకుని చేస్తాను. సినిమా హిట్ అయింది కదా అని పారితోషికం పెంచేద్దాం అనే ఆలోచనే నాకు వుండదు.'' అని విజయ్ స్పష్టం చేశారు.

    Vijay Devarakonda about his remunaration

    పారితోషికం గురించి ఆలోచించుకుంటూ వెళితే మంచి సినిమాలు చేయలేమని విజయ్ స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పారితోషికం గురించి ఆలోచించలేదని, కథలో కొత్తదనం గురించే ఆలోచిస్తానని తెలిపారు. రెమ్యూనరేషన్ కంటే కథల ఎంపికపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు.

    విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' అక్టోబర్ 5న తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. పొలిటిక్ బ్యాక్ డ్రాపుతో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.

    English summary
    "Remuneration never thought about. I would prefer only good stories." Vijay Devarakonda about his remunaration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X