twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సినిమాల్లో మందు, సిగరెట్ ఉంటాయి... యూత్ చెడిపోతే మేము కారణం కాదు: విజయ్ దేవరకొండ

    |

    విజయ్ దేవరకొండ సినిమాల్లో స్మోకింగ్ సీన్లు, ఆల్కహాల్ సీన్లు ఎక్కువగా ఉంటున్నాయి... వీటి వల్ల యువతపై ప్రభావం పడుతుందనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సినిమాల వల్లే యూత్ చెడిపోతున్నారు అనే వాదనను విజయ్ దేవరకొండ ఖండించారు.

    సినిమాల ప్రభావం జనంపై ఎంతో కొంత ఉంటుంది అనేది నిజం. అయితే ఇన్‌ఫ్లూయెన్స్ అనేది పర్సనల్ థింగ్. అది సినిమా థింగ్ కాదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా యూత్ వివిధ దురలవాట్లకు ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారో వివరించారు.

    అది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది

    అది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది

    ఉదాహరణకు... నేను సినిమాలు చూస్తాను. నా ఫ్రెండ్ కూడా సినిమాలు చూస్తాడు. నా ఫ్రెండ్ అతడి ఫేవరెట్ యాక్టర్‌ను చూసి స్మోకింగ్ అలవాటు చేసుకున్నాడు. కానీ నా పేవరెట్ యాక్టర్ స్మోక్ చేస్తున్నా నేను దాన్ని అలవాటు చేసుకోలేదు. ఇన్‌ఫ్లూయెన్స్ అనేది పర్సనాలిటీ థింగ్. అది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని విజయ్ దేవరకొండ తెలిపారు.

    కొందరు అలా, కొందరు ఇలా...

    కొందరు అలా, కొందరు ఇలా...

    కొంతమంది ఏ విషయానికైనా వెంటనే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు. కొంత మంది తమ చుట్టూ ఎవరు ఏం చేసినా ప్రభావితం కారు. నేను మందు తాగుతాను, ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేది నాకు తెలుసు. నాకు స్మోక్ చేయడం ఇష్టం ఉండదు, హెల్త్ రీజన్ కావొచ్చు, మరేదైనా కావొచ్చు.... అని విజయ్ చెప్పుకొచ్చారు.

    సినిమాలు లేకున్నా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు

    సినిమాలు లేకున్నా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు

    సినిమాలు చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవారు సినిమాలు లేకున్నా.. వాళ్ల కాలనీలో అన్నను చూసో, కాలేజీలో ఉండే సీనియర్ నుంచో, ఇలా రకరకాల వ్యక్తులు, పరిస్థితులను చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారని విజయ్ చెప్పుకొచ్చారు.

    అలా ఆలోచిస్తూ కూర్చుంటే సినిమాలు చేయలేం

    అలా ఆలోచిస్తూ కూర్చుంటే సినిమాలు చేయలేం

    ఇలా చేయడం వల్ల ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, అలా చేయడం వల్ల యువత చెడిపోతారు అనే విషయాలు ఆలోచిస్తూ కూర్చుంటే మనం కథను చెప్పలేం. ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన జీవితాన్ని సినిమాలో చూపించాల్సి ఉంటుంది. అది ఫిక్షనల్ కావొచ్చు, రియల్ కావొచ్చు... ఆ పాత్రను రియలిస్టిక్‌గా చూపించడం కోసం స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి కూడా చూపించాల్సి ఉంటుంది. కొన్ని సినిమాల్లో పాత్రకు అలాంటి అలవాట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చని....విజయ్ వ్యాఖ్యానించారు.

    English summary
    "Movies are not the cause of young people's drinking and smoking habits. It depends on their personality and thinking." Vijay Devarakonda about Influence of Smoking and Alcohol scenes on Youth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X