For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger Release date పై విజయ్ దేవరకొండ క్లారిటీ.. అందుకే ఆలస్యం అవుతోంది..

  |

  టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు బాక్సాఫీస్ స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సారి అంతకు మించి అనేలా పాన్ ఇండియా మూవీతో సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విడుదలపై మొత్తానికి విజయ్ ఒక క్లారిటి అయితే ఇచ్చాడు.

  లైగర్ పై భారీ అంచనాలు

  లైగర్ పై భారీ అంచనాలు


  గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం తన ఫిట్నెస్ లో చాలా మార్పులు తెచ్చాడు. అంతేకాకుండా హెయిర్ స్టైల్ లో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అది చూసిన అనంతరం రౌడి స్టార్ నిజంగానే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారు అని అనిపిస్తోంది.

  రిలీజ్ ఎప్పుడు?

  రిలీజ్ ఎప్పుడు?

  లైగర్ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ తో ఇటీవల స్థాయిని మరింత పెంచారు. ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకు చిత్ర యూనిట్ విడుదల తేదీపై అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ ఈ సినిమా విడుదల తేదీ పై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు.

  ఆలస్యం ఎందుకంటే?

  ఆలస్యం ఎందుకంటే?

  ఇంకా డేట్ అయితే ఫైనల్ కాలేదని అంటూ.. ఆలస్యానికి గల కారణం యూఎస్ షెడ్యూల్ అని తెలియజేశారు. రెండు వారాల పాటు కొనసాగే ఈ కీలకమైన షెడ్యూల్లో మైక్ టైసన్ కూడా పాల్గొనబోతున్నారు. ఇక ఈ షెడ్యూల్ కు సంబంధించిన వీసా ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని విజయ్ దేవరకొండ తెలియజేశాడు. షెడ్యూల్ పూర్తయితే తప్పకుండా విడుదల తేదీపై ఒక క్లారిటీ కూడా వస్తుందట.

  కేరోర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ

  కేరోర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ

  పూరి జగన్నాథ్ అయితే ఏ సినిమా అయినా సరే మూడు నాలుగు నెలల్లో ఫినిష్ చేయాలని అనుకుంటాడు. కానీ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. అందుకే కొంత ఆలస్యం అవుతోంది. కరోనా కూడా అందుకు ఒక కారణం. పూరి తన కెరీర్ లోనే భారీ పెట్టుబడితో కరణ్ జోహార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పై విజయ్ దేవరకొండ కూడా చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు అర్థమవుతోంది.

  Recommended Video

  Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
  విజయ్ లైగర్ తరువాత..

  విజయ్ లైగర్ తరువాత..

  ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా పూర్తయింది. ఇక మిగతా షూటింగ్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక అమెరికా కీలక షెడ్యూల్ ముగిస్తే దాదాపు పనులన్నీ కూడా పూర్తి అయినట్లే. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలవబోతున్న విషయం తెలిసిందే ఆ సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందట దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండను ఒక భారత సైనికుడిగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్న ట్లు తెలుస్తోంది. రౌడీ స్టార్ మరొక రెండు కథల పై కూడా చర్చలు జరుపుతున్నాడు. అందులో ఒక సీనియర్ స్టార్ దర్శకుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Vijay devarakonda about liger latest update and release date announcement,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X