twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారక్, ప్రభాస్‌ కింద నేను ఒక బచ్చా: విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్

    By Bojja Kumar
    |

    Recommended Video

    తారక్, ప్రభాస్‌ కింద నేను ఒక బచ్చా: విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్

    సినిమా యాక్టర్లు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో 'ఫిల్మ్‌ఫేర్' అవార్డులను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడక జూన్ 16న హైదరాబాద్‌లోని నోవాటెల్ & హెచ్‌ఐసిసి కాంప్లెక్స్‌లో గ్రాండ్‌గా జరుగబోతోంది. ఈ సారి తెలుగు ఉత్తమ నటుడు కేటగిరీలోమెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు యంగ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. పెద్ద పెద్ద స్టార్లతో కలిసి తాను బెస్ట్ యాక్టర్ కేటగిరీకి నామినేట్ అవ్వడంపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    వారితో పోలిస్తే నేను బచ్చాగాన్ని

    వారితో పోలిస్తే నేను బచ్చాగాన్ని

    ‘వాట్సాప్‌ రౌడీస్‌.. నేను చెన్నైలో ఉన్నా. ‘నోటా' షూటింగ్ చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఫిల్మ్‌ఫేర్‌లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేట్‌ అయ్యానట. చిరు సర్‌, వెంకీ సర్.. బాలయ్య బాబు సినిమాలు నేను చిన్నతనం నుండి చూస్తున్నాను. వారి తర్వాత జనరేషన్ సూపర్ స్టార్స్ తారక్‌ భాయ్‌, ప్రభాస్‌ అన్న.... తర్వాత జనరేషన్ నేను. వారితో నామినేట్ అవ్వడమే గొప్పగా భావిస్తున్నాను. వారి కింద నేను బచ్చాగాడిని.'' అంటూ ఓ వీడియో పోస్టు చేశారు వ్యాఖ్యానించారు.

    నామినేట్ అవ్వడమే అవార్డు గెలిచినంత హ్యాపీ

    నామినేట్ అవ్వడమే అవార్డు గెలిచినంత హ్యాపీ

    అంత పెద్ద స్టార్లతో కలిసి ఉత్తమ నటుడి కేటగిరీలో ఫిలింఫేర్‌కు నామినేట్‌ కావడమే నాకు గొప్ప అచీవ్‌మెంట్‌. అవార్డు గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది. సాధారణంగా పెళ్లిళ్లలో పెద్దలందరూ ఒక చోటు కూర్చొని మాట్లాడుకుంటూ పిల్లలను ఆడుకోమంటారు. ఒక చిన్న పిల్లాడినైన నన్ను పెద్దలందరూ వాళ్ల టేబుల్వ ద్దకు పిలిచినట్లు ఉంది.... అని విజయ్ వ్యాఖ్యానించారు.

    మీలో ఒకరిని నాతో తీసుకెళతాను

    మీలో ఒకరిని నాతో తీసుకెళతాను

    ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్తున్నా.. కాబట్టి నాతో పాటు మీలో ఒకర్ని తీసుకు వెళదామని అనుకుంటున్నాను. మీకు ఇలా చాలా సర్‌ప్రైజెస్ ఇవ్వాలని ప్లాన్స్‌ చేస్తున్నాను. అవేమిటి అనేది రాబోయే రెండు మూడు నెలల్లో చెబుతాను. నన్ను ఎవరైతే బాగా ఇష్టపడతారో.. వారు www.rowdyclub.in వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడ మీ పేరు, వివరాలను ఇవ్వండి. మీలో ఒకర్ని నేను ఫిలింఫేర్‌ కార్యక్రమానికి తీసుకెళతాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం నోటా, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. టాక్సీవాలా మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘అర్జున్ రెడ్డి' హిట్ తర్వాత విజయ్ వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు.

    English summary
    Vijay Devarakonda is one of the 6 nominated Telugu actors for the Best actor in leading role(male) of 2017 category at Filmfare Awards South 2018. Vijay said that it is honour for me.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X