సమంతకు విజయ్ దేవరకొండ బీఫ్ బిర్యానీ.. ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

విజయ్ దేవరకొండ.. సమంత కోసం.. బిర్యానీ తీసుకువచ్చారు. అది కూడా బీఫ్ బిర్యానీ. అది చూసిన సమంత ఏం చేసిందో ఊహించగలరా... అయితే రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో... సమంత, విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో సామ్, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్ అంటున్నారు. ఇక ఇందులోని పలు సన్నీవేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ సినిమా సెప్టెంబరు 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో విజయ్, సమంత ఇద్దరికీ హిట్టు పడిందని చెప్పవచ్చు.

 Vijay Devarakonda

ఖుషి సినిమాను నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మలయాళంలో హృదయం సినిమాకు సంగీతం అందించిన హేషమ్ వాహబ్ అబ్దుల్ ఈ మూవీకి మంచి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

 Vijay Devarakonda

ఇక ఈ సినిమాలో విప్లవ్ గా విజయ్ దేవరకొండ నటించగా... ఆరాధ్యగా సమంత నటించింది. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నాస్తికుడిగా కనిపించగా... సమంత ఈ సినిమాలో బ్రహ్మిణ్ అమ్మాయిగా కనిపించింది.విభిన్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వీరు ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి.. చివరకి కలిశారా లేదా అనేది సినిమా కథాంశం. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో కశ్మీర్ ఎపిసోడ్ బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సమంత మొదట్లో బేగం అమ్మాయిగా పరిచయం అవుతుంది. దీంతో విజయ్ దేవరకొండ ఆమెను ఇంప్రెస్ చేయడానికి బీఫ్ బిర్యానీ తీసుకు వస్తాడు. అసలే ఈమె బ్రహ్మిణ్... ఇక బీఫ్ బిర్యానీ తినాలని తీసుకువచ్చి ఇస్తే.. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించండి.

 Vijay Devarakonda

అది చూసిన సమంత... షాక్ అవుతుంది. విజయ్ చేసిన పనికి... వాంతులు చేసుకుంటుంది. ఇక ఈ సీన్ థియేటర్లలో నవ్వులు పూయించిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో సమంత, విజయ్ జంట చూడటానికి బాగుందని... వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే.. సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఒక్కో సాంగ్.. ఒక్కో డైమండ్ లా అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X