జాతిరత్నాలు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నిన్న ప్రభాస్ ఇప్పుడు మరో హీరో.. షాకిచ్చేలా ఉన్నారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జాతిరత్నాలకు సంబంధించిన వార్తలు బాగానే వైరల్ అవుతున్నాయి. సినిమాకు ముందు నుంచి కూడా ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ పర్ఫెక్ట్ గా వెలుతోంది. ఫైనల్ గా సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇక ట్రైలర్ తోనే చిత్ర యూనిట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మార్చ్ 11న రానున్న ఈ సినిమాకు మరో హీరో కూడా రంగంలోకి దిగుతున్నాడు.

జనాల్లోకి వెళ్లిమరి

జనాల్లోకి వెళ్లిమరి

టీజర్ తో మొదలైన బజ్ ఆ తరువాత సాంగ్ తో మరో లెవెల్ కు వెళ్లింది. అప్పటికే సినిమా మార్కెట్ హై లెవెల్లో ఉండగా సడన్ గా ప్రభాస్ ను రంగంలోకి దింపి ట్రైలర్ ను విడుదల చేయించిన విధానం మరింత బజ్ క్రియేట్ చేసింది. జనాల్లోకి వెళ్లిమరి ప్రమోషన్ చేస్తున్నారు. కాలేజ్, షాపింగ్ మాల్స్ దేన్ని వదలడం లేదు.

చిట్టి సాంగ్ వైరల్

చిట్టి సాంగ్ వైరల్

సినిమాను వైజయంతి వారి స్వప్నా సినిమాస్ లో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. పిట్టగొడ దర్శకుడు అనుదీప్ సినిమాకు దర్శకత్వం వహించగా రాధన్ మ్యూజిక్ అంధించాడు. ఇప్పటికే చిట్టి అనే సాంగ్ యూ ట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇక టీజర్ తో పాటు ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రంగంలోకి విజయ్ దేవరకొండ

రంగంలోకి విజయ్ దేవరకొండ

ముంబై వెళ్లి ప్రభాస్ తో ట్రైలర్ రిలీజ్ చేయించిన వీడియో ఒకటి ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండను రప్పిస్తున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. వరంగల్ లో సాయంత్రం 6గంటలకు ఈవెంట్ స్టార్ట్ కానుంది.

పెరిగిన బిజినెస్ వాల్యూ

పెరిగిన బిజినెస్ వాల్యూ

ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇపుడు అమాంతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. మొదట అనుకున్న బిజినెస్ కంటే సినిమాకు ప్రమోషన్ ద్వారా డిమాండ్ గట్టిగానే పెరిగింది. 15కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది. సినిమాను 7కోట్ల కంటే చాలా తక్కువ బడ్జెట్ తోనే నిర్మించినట్లు సమాచారం.

ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో..

ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో..

బిజినెస్ ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ తోనే సినిమా ప్రాఫిట్ లోకి రావచ్చని సమాచారం. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. లాక్ డౌన్ వల్ల అలసిపోయిన జనాలు మంచి కామెడీ సినిమా చూసి చాలా కాలమయ్యింది కాబట్టి హిట్ టాక్ ను అందుకుంటే భారీ స్థాయిలో ప్రాఫిట్స్ రావడం కాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X