ఈ అమాయక పిల్లాడే... సంచలన ‘అర్జున్ రెడ్డి’ అయ్యాడు (చిన్ననాటి ఫోటో)

విజయ్ దేవరకొండ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. చిన్నతనంలో విజయ్ చాలా అమాయకంగా ఉన్నాడు.

By Bojja Kumar

Recommended Video

Vijay Devarakonda Childhood Pic Goes Viral

'పెళ్లి చూపులు' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ..... 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ హీరో అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ భారీగా గడ్డం, జుట్టు పెంచి మాస్ లుక్‌తో కనిపించాడు.

అయితే చిన్నతనంలో విజయ్ దేవరకొండ ఎంతో ఇన్నోసెంటుగా ఉండేవాడు. అఫ్ కోర్స్ ఇపుడు కూడా విజయ్ ఇన్నోసెంటే... కాక పోతే సినిమాలో తన క్యారెక్టర్ ప్రకారం అలా నటించాడంతే. తాజాగా విజయ్ చిన్ననాటి ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది.

స్కూలు రోజుల్లో విజయ్ దేవరకొండ ఇలా

స్కూలు రోజుల్లో విజయ్ దేవరకొండ ఇలా

10వ తరగతి వరకు విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ సమయంలో విజయ్‌కి యాక్టర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉండేది కాదట. తర్వత అనుకోకుండా ఇటు వైపు వచ్చారు.

తండ్రి సీరియల్ డైరెక్టర్

తండ్రి సీరియల్ డైరెక్టర్

విజయ్ దేవరకొండ తండ్రి సీరియల్ డైరెక్టర్. ఆయన చివరసారిగా 2007 ‘జల్సా' అనే టీవీ షో చేశారు. తర్వాత ఈ రంగానికి దూరం అయ్యారు. ప్రస్తుతం తన తండ్రి వ్యవసాయంపై ఆసక్తిగా ఉన్నారని విజయ్ తెలిపారు.

విజయ్ దేవరకొండ తల్లి గురించి

విజయ్ దేవరకొండ తల్లి గురించి

విజయ్ దేవరకొండ తల్లి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్. గతంలో ఆమె హిమాయత్ నగర్‌లో ‘స్పీక్ ఈజీ' అనే ఇనిస్టిట్యూట్ రన్ చేసేవారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ కుటుంబం హిమాయత్ నగర్లో నివాసం ఉండేది.

ప్యాకెట్ మనీ కోసం

ప్యాకెట్ మనీ కోసం

డిగ్రీ చదివే రోజుల్లో ప్యాకెట్ మనీ కోసం విజయ్ దేవరకొండ కూడా తన తల్లి ఇనిస్టిట్యూట్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చెప్పేవాడట. తనకు పెద్దగా ఏమీ రాక పోయినా.... క్లాస్ చెప్పే ముందు ఏదైనా ఒక బుక్ చదివి వెళ్లి చెప్పేవాడిని అని విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

యాక్టింగ్ వైపు

యాక్టింగ్ వైపు

డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేదని ఇంట్లో చెప్పాను. యాక్టింగ్ మీద ఇంట్రెస్టు ఉందని చెప్పడంతో తొలిసారిగా వినయ్ వర్మ అనే ట్రైనర్ దగ్గర జాయిన్ అయినట్లు విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X