విజయ్ దేవరకొండ వీడియో వైరల్.. ఆశ్చర్యపోయే నిజం!

Recommended Video

Vijay Deverakonda 's Childhood Video goes Viral | Filmibeat Telugu

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సంచలనం. అతడి యాటిట్యూడ్, నటన యువతకు బాగా నచ్చుతున్నాయి. విజయ్ దేవరకొండ క్రేజ్ తో అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. గత ఏడాది విజయ్ దేవరకొండ గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండకి సంబందించిన విడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండని చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

నువ్విలా అనుకుంటే పొరపాటే

నువ్విలా అనుకుంటే పొరపాటే

విజయ్ దేవరకొండ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది నువ్విలా చిత్రంతో అనుకుంటే పొరపాటే. విజయ్ దేవరకొండ చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ టివి సీరియల్ లో నటించాడు. ఆ సీరియల్ కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన ఆ సీరియల్ పేరు షిరిడి సాయి పర్తి సాయి దివ్య కథ.

పాల బుగ్గలతో

పాల బుగ్గలతో

విజయ్ దేవరకొండ ఈ సీరియల్ లో పాల బుగ్గలతో ముద్దొచ్చే విధంగా కనిపిస్తున్నాడు. 'చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామి వారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్' అంటూ విజయ్ దేవరకొండ ముద్దు ముద్దుగా డైలాగులు చెబుతున్నాడు. ఉపాధ్యారాలు తన విద్యార్థులకు పుట్టపర్తి మహత్యాన్ని వివరించే సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇది.

రిపీట్‌గా చూస్తున్నా

విజయ్ దేవరకొండ అభిమానులు కొందరు ఈ వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించాడు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ బుడ్డోడు కూడా స్టారే. నేను కూడా ఈ వీడియోని రిపీట్ గా చూస్తున్నా. ఈ వీడియో ఎవరు బయటకు తీశారో కానీ.. నాకు, మా అమ్మకు ఈ రోజు గుర్తుంది పోయేలా చేశారు అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. రెండవసారి ఈ చిత్రంలో రష్మిక మందనతో రొమాన్స్ చేస్తున్నాడు. మరో వైపు విజయ్ దేవరకొండ నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పెళ్లి చూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్, అనసూయ ప్రధాన పాత్రల్లో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X