వాటిని వాటిలా చూడరట.. డాక్టర్స్ పై విజయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రౌడీపై ఫైర్
టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండకు ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. పైగా ఆ ట్రోల్స్‌ను కూడా తెగ ఎంజాయ్ చేసేస్తుంటాడు. తనపై మరింతగా ట్రోల్స్ చేయండని కోరుకునే టైప్ ఈ రౌడీ హీరో. నిన్ననే (ఫిబ్రవరి 14) వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకోవడంలో కాస్త తడబడినట్టు టాక్ వచ్చింది. సరే సినిమా విషయం పక్కన పెడితే.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో విజయ్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

ట్రోల్స్‌ను ఇష్టపడే హీరో..
మామూలుగా అయితే సెలెబ్రిటీలు ట్రోల్స్‌ను అంతగా ఇష్టపడరు. కానీ విజయ్ దేవరకొండ శైలే వేరు. తనపై వచ్చిన ది బెస్ట్ ట్రోల్స్ తానే ప్రకటిస్తాడు. మన మీద ఎంత ప్రేమ లేకపోతే ట్రోల్స్, మీమ్స్ చేస్తుంటారు.. మనకోసం వారు ఎంతో సమయాన్ని కేటాయిస్తారంటూ.. అందుకే నాకు వారు చేసే మీమ్స్, ట్రోల్స్ ఇష్టమని అంటుంటాడు.

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా..
విజయ్ దేవరకొండ తన సినిమాలకు చేసే ప్రమోషన్స్‌ను చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అందరి కంటే భిన్నంగా ఆలోచించడం, కనబడటం, వినూత్న కాన్సెప్ట్‌తో ముందుకు రావడం చూస్తుంటాము. అయితే ఈ సారి మాత్రం అంత ఎక్కువగా హడావిడి చేయలేదు. కానీ ఓ మీడియాతో ముచ్చటిస్తూ.. విజయ్ నోరు జారాడు. అదే ఇప్పుడు అతని మెడకు చుట్టుకుంది.

డాక్టర్‌తో డేటింగ్..
తనకు డాక్టర్‌తో డేటింగ్ చేయాలని ఉందంటూ రాశీ ఖన్నా తన మనసులో మాటను చెప్పుకొచ్చింది. ఒక వేళ తనకు గనుక చాన్స్ వస్తే.. ఓ డాక్టర్‌తో డేటింగ్ చేస్తానని రాశీ ఖన్నా వెల్లడించింది. అయితే పక్కనున్న విజయ్.. డాక్టర్ల గురించి ఓ మాట అనేశాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వాటిపై డాక్టర్లు, నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.
Recommended Video


వారు అలా చూడరు..
డాక్టర్లు అసలు టైమే ఇవ్వరు.. వారు నీ చిక్స్‌ను చిక్స్‌లా చూడరు.. అప్పర్ పార్ట్ చెస్ట్‌ను చెస్ట్‌లా చూడరు అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. దీంతో చాలు చాలు అంటూ నవ్వుతూనే రాశీఖన్నా విజయ్‌ను ఆపమని చెప్పింది. అర్జున్ రెడ్డి చేయడంతో ఇవి తెలిశాయా? అని రాశీ ఖన్నా అంది. విజయ్ చేసిన ఆ కామెంట్స్‌తోనే కొందరు హర్ట్ అయినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











