twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద స్టార్ హీరోవా? మూసుకుని కూర్చో అన్నారు, ఎవరిమాట వినను : విజయ దేవరకొండ

    By Bojja Kumar
    |

    'అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండ ఇటీవల 'రౌడీ' పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఒక్క సినిమా హిట్‌తో విజయ్ ఈ రేంజిలో రెచ్చిపోవడం, యువతకు అడ్వైజ్ ఇచ్చే స్థాయికి వెళ్లడంపై కొందరు చేసిన కామెంట్స్ చేశారట. ఆ కామెంట్స్ నా చెవిన పడ్డాయని, ఎవరు ఏమన్నా నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని విజయ్ దేవరకొండ తేల్చి చెప్పారు.

    నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చాను

    నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చాను

    మెజారిటీ ఆఫ్ పాపులేషన్ మిడిల్ క్లాస్. నేను అక్కడి నుండే వచ్చాను. రౌడీ యాటిట్యూడ్ నాకు వర్కౌట్ అయింది. నన్ను ఫాలో అయ్యేవారు, నేనంటే ఇష్టపడే వారికి ఇద్దరు ముగ్గురికైనా అలాంటి యాటిట్యూడ్ హెల్ప్ అయితే మంచిదే అని నా భావన. మనకు నచ్చింది చేయాలనేది నా ఫిలాసఫీ అని విజయ్ దేవరకొండ తెలిపారు.

    నేను ఇట్లా మాట్లాడినందుకు...

    నేను ఇట్లా మాట్లాడినందుకు...

    నేను ఇట్లా మాట్లాడినందుకు... నువ్వేమైనా పెద్ద స్టార్ హీరోవా? అందరికీ అడ్వైజ్ ఇవ్వడానికి అని ఇండస్ట్రీలో కొందరు అంటారు. నాకు అనిపించింది నేను ఇస్తా. ప్రపంచం నీకు ఇలానే ఉండాలి అని చెబుతుంది. ఈ లెవల్ అయితేనే ఇలా మాట్లాడాలి, ఇండస్ట్రీ బయట ఎవడైనా మూసుకుని కూర్చోవాలి అంటారు.

     నేనెందుకు వినాలి? నాకు నచ్చింది నేను చేస్తాను

    నేనెందుకు వినాలి? నాకు నచ్చింది నేను చేస్తాను

    నేనెందుకు వినాలి? నాకు నచ్చింది నేను చేస్తాను. నాకు అనిపించింది చేశాను, నాకు నచ్చిన సినిమాల్లో నటించాను. నచ్చిన వ్యక్తులతో పని చేశాను. మన అందరికీ ఆ ఫ్రీడం ఉండాలి. ఎవరో మనకు వచ్చి ఎందుకు చెప్పాలి.

    ఎవరికీ చెడు చేయొద్దు

    ఎవరికీ చెడు చేయొద్దు

    ఎవరికీ చెడు చేయొద్దు... అదే సమయంలో మన లైఫ్ బెటర్మెంటుకు, మన చుట్టూ ఉన్నవారి బెటర్మెంటు కోసం ఏదైనా చేయగలగాలి. దాన్ని జనాలు వీడు ఎవడి మాట వినడు, ఇట్లానే చేస్తాడు రౌడీ అని పలిచేవారు. అందుకే నేను ‘రౌడీ' అనే మాటను గర్వంగా స్వీకరించాను. ఇందులో నెగెటివ్ ఏమీ లేదు, ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి.

    వారి అభిమానం చూసి సంతోషించాను

    వారి అభిమానం చూసి సంతోషించాను

    ఫిల్మ్ ఫేర్ అవార్డుల సమయంలో 4 గంటలు కూర్చున్నాను. రాత్రి 1 గంటల అయినా జనాలు నాకు అవార్డు ఇచ్చే సమయం కోసం వెయిట్ చేస్తూ అరిచారు. మామూలుగా బెస్ట్ యాక్టర్ అవార్డ్ చివరగా ఇస్తారు. నాది అందరికంటే లాస్ట్ ఇచ్చారు. వారు నా కోసం ఇంకా వెయిట్ చేస్తుంటే వారి అభిమానం చూసి సంతోషం కలిగిందని విజయ్ తెలిపారు.

    అవార్డ్ సీఎంఆర్ఎఫ్‌కు ఇవ్వకపోతే ఇంత ఉండేది కాదు.

    అవార్డ్ సీఎంఆర్ఎఫ్‌కు ఇవ్వకపోతే ఇంత ఉండేది కాదు.

    మత్రి కేటీఆర్‌ ట్విట్టర్ అకౌంట్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను. సిటీలో ఏం జరుగుతుంది? అనేది తెలుసుకునే వాడిని. అందులో సీఎంఆర్ఎఫ్ నుండి ఇంత సహాయం చేశామనే సందేశాలు చూసేవాడిని. నాకు అప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ అంటే ఏంటో కూడా తెలియదు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని... వైద్యం పరంగా ఆర్థిక సహాయం అవసరం అయిన వారికి ఇస్తారని తెలిసింది. అపుడు నాకు అనిపించింది నేను ఇక్కడి వాడిని, నా ఫస్ట్ అవార్డ్ ఇంటి స్టెప్ దగ్గర ఆగిపోకుండా ఇంకో స్టెప్ తీసుకోగలిగితే బావుంటుంది అనిపించింది. ఆ అవార్డ్ సీఎంఆర్ఎఫ్‌కు ఇవ్వకపోతే ఇంత ఉండేది కాదు.

    తీసుకుంటారో లేదో అనే భయంతోనే ట్వీట్ చేశాను

    తీసుకుంటారో లేదో అనే భయంతోనే ట్వీట్ చేశాను

    మొదట ఈ అవార్డును ఎవరైనా తీసుకుంటారో లేదో అనే భయంతోనే ట్వీట్ చేశాను. నెక్ట్స్ డే కేటీఆర్ గారు ట్వీట్ చేసి అప్రిషియేట్ చేశారు. ఎలా చేద్దాం అని ఆయన అడిగితే వేలం వేద్దామనే ఐడియా ఉందని చెప్పాను. చాలా మంది కాల్ చేశారు. దివి ల్యాబొరేటరీస్ వారు బిగ్గెస్ట్ అమౌంట్ రూ. 25 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారని విజయ్ పేర్కొన్నారు.

    English summary
    Tollywood actor Vijay Deverakonda has auctioned his first ever Filmfare award for Rs 25 Lakh to Shakunthala Divi (Divi Laboratories) for Chief Minister's Relief Fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X