విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ లుక్ ఇదే...
పెళ్లి చూపులు సినిమాతో పెర్ఫార్మెన్స్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో పెద్ద బేనర్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్లో 'టాక్సీవాలా' చిత్రం చేస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించబోయే 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటించబోతున్నాడు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9)ని పురస్కరించుకుని 'డియర్ కామ్రేడ్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Recommended Video


'డియర్ కామ్రేడ్' ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. నువ్వు ప్రేమించే దాని కోసం పోరాడు అనే క్యాప్షన్‌తో పోస్టర్ డిజైన్ చేశారు. అయితే ఇది ప్రేమకథా చిత్రమా? లేక ఇంకేదైనా కొత్త కాన్సెప్టా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఎక్కువగా యూత్ మెచ్చే కథలవైపే మొగ్గు చూపుతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అలాంటివే. 'డియర్ కామ్రేడ్' కూడా ప్రస్తుత యువతరానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అనే ప్రచారం జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
కాగా... విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' మే 18న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ 2 , యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్‌కెఎన్ నిర్మాత. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











