విజయ్ దేవరకొండ-పునీత్ రాజ్‌కుమార్: ఎందుకు కలిశారు?.. ఎక్కడ?..

Recommended Video

ఈ స్టార్ హీరోల కలయిక ఎందుకో..?

స్టార్ డమ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి కెమెరాకు పోజు ఇస్తే అభిమానులు పొందే కిక్కే వేరు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్, అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ.. అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వీళ్లిద్దరు ఎందుకు కలిసినట్లు?.. ఎక్కడ కలిసినట్టు?..

 రాజ్‌కుమార్ ఇంట్లో:

రాజ్‌కుమార్ ఇంట్లో:

విజయ్ దేవరకొండ ఇటీవల బెంగళూరు వెళ్లిన సమయంలో.. కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ను ఆయన ఇంటి వద్ద కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోను పునీత్‌ రాజ్‌కుమార్‌ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 రాజ్‌కుమార్ కితాబు:

రాజ్‌కుమార్ కితాబు:

విజయ్ దేవరకొండతో దిగిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పునీత్ రాజ్ కుమార్.. 'సూపర్‌ టాలెంటెడ్‌ విజయ్‌ దేవరకొండను ఇంటిలో కలిశాను, ఈ వారం గొప్పగా ప్రారంభమైంది' అని పేర్కొనడం విశేషం.

 ఒకే డ్రెస్ లో..:

ఒకే డ్రెస్ లో..:

ఫోటోలో విజయ్ దేవరకొండ, పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లోనే కనిపిస్తుండటం విశేషం. ఈ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చిన ఫోటొ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

 ఎందుకు కలిశారు?:

ఎందుకు కలిశారు?:

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్‌తో కలిసి విజయ్ దేవరకొండ బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా విజయ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో.. ఆ సినిమాకు సంబంధించిన చర్చల కోసం విజయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి రాజ్‌కుమార్‌ను కలిసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును 'అర్జున్ రెడ్డి' కంటే ముందే ఓకె చేశామని రాక్ లైన్ వెంకటేష్ చెబుతున్నారు.

పరుశురాం సినిమాలో:

పరుశురాం సినిమాలో:

ఈ ఫోటో పట్ల విజయ్ దేవరకొండ హ్యాపీగా ఫీలవుతున్నాడు. పునీత్‌ అన్నతో సరదాగా గడిపానంటూ విజయ్‌ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. ఇందులో కన్నడ నటి రష్మికా మండన్న కథానాయిక.

 తమిళంలోనూ..:

తమిళంలోనూ..:

అర్జున్ రెడ్డితో పక్క ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ.. తమిళంలోనూ తెరంగేట్రం చేస్తుండటం విశేషం. విజయ్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా ఒకేసారి విడుదలవుతుందని తెలుస్తోంది.

 ఒకేసారి మూడు కవర్ చేస్తున్నాడు:

ఒకేసారి మూడు కవర్ చేస్తున్నాడు:

ఇటీవలే కన్నడ సినిమా చమక్ ఆడియో ఫంక్షన్ లోనూ విజయ్ దేవరకొండ మెరిశాడు. కన్నడలో మాట్లాడి అక్కడివాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రాజ్ కుమార్‌తో ఫోటో దిగి కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. మొత్తానికి ఇటు తెలుగు, అటు కన్నడ-కోలీవుడ్ లను కూడా ఒకేసారి కవర్ చేస్తున్నాడు విజయ్. భవిష్యత్తులో అతని మార్కెట్ పెరగడానికి ఇదంతా దోహదపడుతుందేమో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X