వంద వంద వేసుకుని తాగాం.. నైట్ అలాంటి పనులు చేశాం: కాలర్ ఎగరేసి చెబుతున్నానంటూ విజయ్ ఎమోషనల్

తెలుగులో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే, కొన్ని మాత్రమే విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంటాయి. పెద్ద పెద్ద స్టార్లు నటించే సినిమాలకే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ, చిన్న హీరో చేసిన ఓ సినిమా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అదే 'జాతి రత్నాలు' మూవీ. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రం గురించి ప్రేక్షకులంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

భర్తతో శృంగార భంగిమల్లో బీచిలో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

వాళ్లందరూ ‘జాతి రత్నాలు'గా వస్తున్నారు

వాళ్లందరూ ‘జాతి రత్నాలు'గా వస్తున్నారు

'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో భారీ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనుదీప్ కేవీ తెరకెక్కించాడు. ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది.

అదిరిపోయే ప్రమోషన్.. భారీగా అంచనాలు

అదిరిపోయే ప్రమోషన్.. భారీగా అంచనాలు

'జాతి రత్నాలు' మూవీ కొద్ది రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెగ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుండడమే. అంతేకాదు, వినూత్నంగా ఆలోచించి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ కారణంగానే విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు అనుగుణంగానే ప్రీ బిజినెస్ కూడా

అందుకు అనుగుణంగానే ప్రీ బిజినెస్ కూడా

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో కలిసి హీరో నవీన్ పోలిశెట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై బజ్‌ను విపరీతంగా పెంచేశాయి. దీంతో చిన్న సినిమానే అయినా.. మీడియం రేంజ్ హీరోలతో సమానంగా దాదాపు రూ. 15 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది.

వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. రౌడీ స్టార్ రాక

వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. రౌడీ స్టార్ రాక

'జాతి రత్నాలు' విడుదలకు సమయం దగ్గర పడడంతో, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వ‌రంగ‌ల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా సినిమాకు బెస్ట్ విషెస్ చెప్పిన అతడు.. ఇందులో ఉన్న వాళ్లందరితో అనుబంధాన్ని పంచుకున్నాడు.

కాలర్ ఎగరేసి చెబుతున్నానంటూ విజయ్

కాలర్ ఎగరేసి చెబుతున్నానంటూ విజయ్

ముంబైలో తెలుగు ఆడియెన్స్ గురించి అక్కడి వాళ్లంతా అడుగుతుంటారన్న విజయ్ దేవరకొండ.. 'మా ఆడియెన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. ఈవెంట్ అని చెబితే వేల మంది వస్తారు. మా గురించి తిక్క తిక్కగా మాట్లాడితే కొట్లాడతారు అని వాళ్లకు నేను చెబుతాను. తెలుగు వాళ్లను బీట్ చేసే ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎక్కడా లేరు. కాలర్ ఎగరేసి చెబుతున్నా' అంటూ గర్వంగా చెప్పాడీ రౌడీ స్టార్.

వంద వంద వేసుకుని తాగాం.. నైట్ అలాంటి

వంద వంద వేసుకుని తాగాం.. నైట్ అలాంటి

హీరోల గురించి చెబుతూ.. 'కలిసి కలలు కన్నాం.. కష్టాలు చెప్పుకున్నాం.. నవ్వించారు.. ధైర్యమిచ్చారు.. వంద వంద వేసుకుని తిన్నాం, తాగాం. దర్శి లేకపోతే 'పెళ్ళిచూపులు'లో ప్రశాంత్ లేడు. శివ లేకపోతే అర్జున్ లేడు. ఇక, నవీన్ నేను హీరోలు అవుతామని అప్పట్లో అనుకున్నాం. నైట్ నిద్ర పోకుండానే కలలు కన్నాం. ఇప్పుడు అదే నిజమైంది' అని చెప్పుకొచ్చాడు విజయ్.

అతడు లేకపోతే విజయ్ దేవరకొండ లేడు

అతడు లేకపోతే విజయ్ దేవరకొండ లేడు

చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ గురించి చెబుతూ.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చేసేటప్పుడు చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాడు నాగి. యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో కొట్లాడి మరీ రోల్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాగి' అని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు విజయ్ దేవరకొండ. అలాగే, హీరోయిన్ ఫిరియా అబ్దుల్లాను సైతం ప్రశంసించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X