twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవసరమైన ప్రతీసారి మీరు వచ్చారు.. ఇప్పుడు కూడా మీరే నడిపించండి.. చిరుకు విజయ్ విన్నపం

    |

    తెలుగు చిత్ర సీమ పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు చనిపోయాక.. ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఏదైనా సమస్యలు వచ్చినా, చిన్న చిత్రాలను ఆదుకోవడంలోనూ, విపత్కర సమయంలో అందరికీ అండగా నిలబడటంలోనూ చిరంజీవి ముందుంటున్నాడు. ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ తాజాగా ప్రస్తావిస్తూ..తాను మొదలు పెట్టిన ఈ పోరాటానికి మార్గనిర్దేశం చేయాలని కోరాడు.

    Recommended Video

    Vijay Deverakonda Slipper Shot To A Gossip Website | Oneindia Telugu

    తప్పుడు వార్తలు, అలాంటి వార్తలు రాసే వెబ్‌సైట్స్‌పై విజయ్ దేవరకొండ విరుచుకపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ పోరాటానికి చిరు మద్దతు తెలిపాడు. ఈ మేరకు విజయ్ స్పందిస్తూ.. మార్గనిర్దేశం చేయవల్సిందిగా చిరును కోరాడు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    ఫేక్ న్యూస్, వెబ్‌సైట్స్‌పై విజయ్ ఫైర్..

    ఫేక్ న్యూస్, వెబ్‌సైట్స్‌పై విజయ్ ఫైర్..

    కరోనా లాంటి విపత్కర కాలంలో మధ్య తరగతికి చెందిన జనాలకు సాయం చేసేందుకు దేవరకొండ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మిడిల్ క్లాస్ ఫండ్స్‌ను స్థాపించింది. దీని ద్వారా మిడిల్ క్లాస్ ఫ్యామీలీకి సాయం చేస్తున్నాడు. వీటిపై తప్పుగా వార్తలు రాస్తూ వక్రీకరించడంపై విజయ్ ఫైర్ అయ్యాడు.

    కదిలిన టాలీవుడ్..

    కదిలిన టాలీవుడ్..

    ఫేక్ న్యూస్ రాసిన సదరు వెబ్‌సైట్స్‌ను కట్టడి చేయాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చాడు. ఈ మేరకు మహేష్ బాబు నుంచి అల్లరి నరేష్ వరకు ఎంతో మంది సెలెబ్రిటీలు విజయ్‌కు మద్దతుగా నిలిచారు. వంశీ పైడిపల్లి, కొరటాల శివ, శివ నిర్వాణ, మెహర్ రమేష్, రాశీ ఖన్నా, కాజల్, నాగబాబు, రానా, రవితేజ ఇలా ఎంతో మంది అండగా నిలిచారు.

    స్పందించిన చిరు..

    స్పందించిన చిరు..

    ‘డియర్ విజయ్ మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము నీ వెంటే ఉంటాము.. ఏది ఏమైనా మంచి చేయాలనే నీ ఉద్దేశ్యాన్ని మాత్రం మార్చుకోకు. మీ వ్యక్తిగత ఉద్దేశ్యాలను వార్తలుగా రాయోద్దని జర్నలిస్ట్ మిత్రులను నేను సవినయంగా కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

    విజయ్ స్పందిస్తూ..

    ‘థ్యాంక్యూ చిరు సర్..నేను వచ్చి ఐదేళ్లే అవుతోంది.. ఈ 42 ఏళ్లలో మీకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఊహించగలను. డాడీ మీకు జరిగిన సిట్యువేషన్స్ చెప్తుంటారు. మీరు అవన్నీ దాటి వాళ్లని క్షమించి.. ఇకా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. సలహాలుఇవ్వడంలో గానీ, మా సినిమా ప్రమోషన్స్‌లో గానీ, ఆశీర్వదించడంలో గానీ, సమస్యలను పరిష్కరించడంలో గానీ ఇలా మాకు అవసరం వచ్చిన ప్రతీసారి మీరు ఉన్నారు.. మీరు మాకు దిశా నిర్దేశం చేయాలని సినిమా పరిశ్రమ తరుపును మేమంతా కలిసి అడుగుతున్నామ'ని ట్వీట్ చేశాడు.

    English summary
    Vijay Devarakonda Emotional Tweet On Chiranjeevi About KIll Fake News. He Tweeted That You have always been there for each of us when we needed you, advicing us, promoting our films, giving your blessings, sorting problems.. Now we as an industry collectively want your support in guiding us.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X