Vijay Devarakonda Kushi: ఆ మాట విని ఐదేళ్లు అయిందంటూ... విజయ్ దేవరకొండ ఎమోషనల్

విజయ్ దేవరకొండ.. హిట్టు విని చాలా కాలమే అయింది. ఇక ఆయన తాజాగా నటించిన ఖుషి సినిమాతో ఆ మాట వినేశారు. లైగర్ సినిమాతో ఒక్కసారిగా దెబ్బతిన్న విజయ్... ఇప్పుడు ఖుషి సినిమాతో ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి సినిమా రెస్పాన్స్ చూసిన విజయ్... తన ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లు వస్తున్నాయ్ అంటూ.. ఓ సందేశం రాసుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ లోకి ఓ మామూలు కుర్రాడిలా ఎంట్రీ ఇచ్చి.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత గీత గోవిందం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత తీసిన సినిమాలు ఆ రేంజ్ హిట్టును ఇవ్వలేకపోయాయి. ఇక గత ఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆయన.. కెరియర్లోనే భారీ డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

 Vijay Devarakonda Kushi:

ఇక ఇప్పుడు లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శివనిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు హిట్ పడిందని తెలుస్తోంది.

ఇక ఈ సందర్భంగా విజయ్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఎమోషనల్ అయ్యారు. నాతో పాటు మీరు ఐదేళ్లు ఎదురుచూస్తున్నారు.. నా కోసం ఎంతో సహనంగా ఎదురుచూశారు.. మొత్తానికి ఈ రోజు హిట్టు కొట్టేశాం... వందల ఫోన్లు, మెసెజ్‌‌ లతో నిద్రలేచా.. కన్నీళ్లు ఆపుకోలేకపోతోన్నాను.. లవ్యూ ఆల్.. అంటూ ట్విట్టర్ లో రాస్తూ ఎమోషనల్ అయ్యారు.

 Vijay Devarakonda Kushi:

ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌ తో కలిసి సినిమాను ఎంజాయ్ చేయండి.. మీరు వెళ్తారని నాకు తెలుసు.. అంటూ రాసుకొచ్చారు. ఇక విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సినిమా ప్రమోషన్స్లో విజయ్... తాను మాట్లాడను.. ఖుషి సినిమా మాట్లాడుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మరోసారి రికార్డులు బ్రేక్ చేసేలా ఉంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఇద్దరు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంటే.. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు.. ఏంటి.. ఎలా కలిసి బతకాలి అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. సినిమా చివరి 30 నిమిషాలు కదిలించేస్తుందని అంటున్నారు. ఇకు ఖుషి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X