మిడిల్ క్లాస్‌కు కొండంత సాయం.. 17 వేల కుటుంబాలకు సాయం చేసిన విజయ్ దేవరకొండ

సాయం చేయడంలోనైనా, నటించడంలోనైనా, మాట్లాడే తీరులోనైనా విజయ్ దేవరకొండ శైలి అందరిలోనూ ప్రత్యేకం. తెరపై నటనలోని విశ్వరూపాన్ని ప్రదర్శించినా, వేదికలెక్కి మాటల ఝరిని ప్రవహింపజేసినా విజయ్ స్టైలే వేరు. కరోనా లాంటి కష్టకాలంతో అందరి కంటే విభిన్నంగా ఆలోచించి, ప్రభుత్వ సాయానికి నోచుకోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని చేయడం మొదలు పెట్టాడు.

Recommended Video

Vijay Devarakonda Helping Thousands Of People Through His Foundation
దేవరకొండ ఫౌండేషన్..

దేవరకొండ ఫౌండేషన్..

విజయ్ దేవరకొండ మొదట్నుంచీ సేవా భావంతోనే ఉన్నాడు. ఎంతోకొంత సాయం చేయాలని, తన వల్ల కొందరికైనా ఉపాధి కలగాలని దేవరకొండ ఫౌండేషన్‌ను మొదలుపెట్టాడు. రౌడీ బ్రాండ్‌తో దుస్తుల కంపెనీ పెట్టాడు. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం పొందిన ఓ వ్యక్తి క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాడు.

కరోనా సమయంలో అండగా..

కరోనా సమయంలో అండగా..

కరోనా సమయంలో ఎంతో మంది శ్రీమంతులు, స్వచ్చంద సంస్థలు నిరుపేదలకు, ఉపాది కోల్పోయిన వారికి, వలస కార్మికులకు సాయం చేశారు. వారి ఆకలి కేకలు విని.. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఏ సాయం అందక బిక్కుబిక్కు మంటున్న మధ్య తరగతి వారి గురించి విజయ్ దేవరకొండ మాత్రమే ఆలోచించాడు.

మిడిల్ క్లాస్ ఫండ్..

మిడిల్ క్లాస్ ఫండ్..

మధ్య తరగతి ప్రజల కోసం మొదటగా 25 లక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు విజయ్ దేవరకొండ. అందరి సహకారంతో పెరుగుతూ వచ్చి కోట్లకు చేరుకుంది. ఓ వైపు విరాళాలు పెరుగుతుండటం, మరోవైపు సాయం అందుకుంటున్న కుటుంబాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

17 వేల మందికి సాయం..

17 వేల మందికి సాయం..

ఇప్పటి వరకు ఎంత మందికి సాయం అందింది, ఎంత మంది విరాళాలు ఇచ్చారు.. అనే వివరాలను ప్రకటించాడు. ఇప్పటి వరకు 17, 723 కుటుంబాలకు అంటే.. 58808 మందికి సాయం చేశారు. 535 మంది వాలంటీర్లు పనిచేయగా.. మొత్తం 1.71కోట్ల ఫండ్ ఖర్చు చేసినట్టు.. అందులో 8515 మంది విరాళాలు ఇవ్వగా.. వారిచ్చిన మొత్తం 1.50కోట్లుగా ఉందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X