నా బర్త్ డే రోజే ప్రమోషన్స్.. ఎక్కువైపోయింది.. F3, నాని సినిమాలపై విజయ్ దేవరకొండ కామెంట్!
టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ తదుపరి సినిమా లైగర్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తో కూడా విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వబోతున్నారు. అయితే అదే రోజు మిగతా సినిమాల అప్డేట్స్ కూడా ఉండడం తో విజయ్ దేవరకొండ ఎవరూ ఊహించని విధంగా మిగతా సినిమాలకు కూడా కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

లైగర్ గ్రాండ్ రిలీజ్
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ అనుకోని విధంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. లైగర్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక స్క్రీన్స్ లలో విడుదల కానుంది.

లైగర్ థీమ్..
చిత్ర యూనిట్ సభ్యులు అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో కీలకమైన అప్డేట్ ను ఇవ్వబోతున్నారు. ఈ నెల 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. సోమవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు లైగర్ కు సంబంధించిన ఒక స్పెషల్ థీమ్ ను విడుదల చేయబోతున్నట్లు విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

నా బర్త్ డే రోజు..
అయితే అదే రోజు మరి కొన్ని సినిమాల అప్డేట్స్ కూడా ఉండడంతో విజయ్ దేవరకొండ వాటిపై కూడా విభిన్నంగా స్పందించడం విశేషం. చాలా మూవీ ప్రమోషన్స్ నా బర్త్ డే రోజు ఉన్నాయంటూ..ఇది ఫెస్టివల్ డే అని చాలా సరదాగా స్పందించాడు. అందరికీ విజయ దేవరకొండ బర్త్ డే సెంటిమెంట్ ఎక్కువ అయిపోయింది అంటూ అంతా మంచే జరుగుతుంది అని నేను కూడా నా పవర్ కూడా షేర్ చేస్తాను అని దేవరకొండ వివరణ ఇ

ఆ సినిమాల అప్డేట్స్
విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఒకేసారి అతని సినిమాలకు సంబంధించిన రెండు కీలకమైన అప్డేట్స్ రాబోతున్నాయి. లైగర్ సినిమా స్పెషల్ థీమ్ తో పాటు తన 11 సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారు. ఇక అదే రోజు వరుణ్ తేజ్ వెంకటేష్ మల్టీస్టారర్ కామెడీ F3 సినిమా అప్డేట్ కూడా రానుంది. అంతేకాకుండా అడివి శేష్ మేజర్, అలాగే నాని అంటే.. సుందరానికి, బాలీవుడ్ మూవీ పృధ్విరాజ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా అదే రోజు రాబోతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ బర్త్ డే పై అలా సరదాగా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











