అమ్మాయిలతో విజయ్ దేవరకొండ రచ్చ రచ్చ.. నోటాపైనే అందరి దృష్టి!
Recommended Video

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఈ చిత్రం శుక్రవారం రోజు భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వరుస విజయాలతో విజయ్ దేవరకొండ సంచలన హీరోగా మారిపోయాడు. దీనితో నోటా చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆనంద్ శంకర్ దర్శత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నోటా రూపొందింది. నోటా చిత్రాన్ని సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రూపొందించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు.

జోరుగా ప్రచారం
నోటా ఎలక్షన్ క్యాంపైన్ పేరుతో ఈ చిత్రానికి భారీగా ప్రచారం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి. విజయ్ దేవరకొండకు జోడిగా ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అమ్మాయిలతో చిందులు
తాజగా ఈ చిత్ర వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేశారు.ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండ అమ్మాయిల చుట్టూ తిరిగే రోమియోలా, రాజకీయ నాయకుడిలా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. హే మినిష్టర్ అంటూ సాగే ఈ వీడియో సాంగ్ ప్రోమో యువతని ఆకర్షిస్తోంది.

రొమాంటిక్ వీరుడిగా
పార్టీలు, చిందులు, అమ్మాయిలు అంటే ఇష్టపడే యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఇలా అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనేదే ఈ చిత్ర కథ. విజయ్ దేవరకొండ రొమాంటిక్ విన్యాసాలు యువతని ఆకట్టుకుంటున్నాయి.
అందరి దృష్టి నోటాపైనే
గీత గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండ కలెక్షన్ల సునామి సృష్టించాడు. దీనితో అందరి దృష్టి నోటాపై పడింది. నోటా చిత్రం ఏస్థాయిలో కలెక్షన్లు రాబడుతుందో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











