పగలూ రాత్రీ ఆదే పని.. ఆసుపత్రిలో చేరిన విజయ్ దేవరకొండ!

Recommended Video

Why Is Vijay Devarakonda Admitted In Hospital? | Filmibeat Telugu

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్, దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెండ్ హీరో. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్ర విజయాలతో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా, కార్మిక నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ ఆసుపత్రిపాలైనట్లు వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగిందో వివరాలు చూద్దాం!

 హోలీ సెలెబ్రేషన్స్

హోలీ సెలెబ్రేషన్స్

విజయ్ దేవరకొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆరోగ్యంగా కనిపించే విజయ్ ఇలా సడెన్ గా ఎందుకు ఆసుపత్రిలో చేరాడనే అనుమానం రావచ్చు. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. విజయ్ దేవరకొండ ఎంత ఉత్సాహంగా ఉంటాడో అందరికి తెలిసిందే. గురువారం దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. సెలెబ్రిటీలు కూడా హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. హోలీ సెలెబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ మరీ అతిగా ఎంజాయ్ చేయడంతో ఈ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

 పగలూ రాత్రీ ఆదే పని

పగలూ రాత్రీ ఆదే పని

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉండడంతో చిత్ర యూనిట్ బిజీ షెడ్యూల్ ని ప్లాన్ చేసింది. హోలీ సంబరాల్లో విజయ్ దేవరకొండ పగలూ రాత్రీ అని తేడా లేకుండా చిందులేశాడట. దీనితో బాగా నిరసించి జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ ఇంట్లోనే ఉంది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ వేగంగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండడంతో ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని విజయ్ భావించినట్లు తెలుస్తోంది.

రష్మికతో రొమాన్స్

రష్మికతో రొమాన్స్

డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన రెండవసారి నటిస్తోంది. గీత గోవిందం చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ టీజర్ లో వీరిద్దరి ముద్దు సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది. మరోమారు ఈ జంట ఘాటు రొమాన్స్ కు సిద్ధం అవుతున్నారు. రష్మిక ఈ చిత్రంలో మహిళ క్రికెటర్ పాత్రలో నటిస్తోందట.

వరుస చిత్రాలతో

వరుస చిత్రాలతో

డియర్ కామ్రేడ్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర వైవిధ్యంగా ఉంటుందట. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. మే 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X