న్యూడ్ ఫోటోకు ప్యాంటేసిన నెటిజన్... విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ రిప్లై

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లైగర్. విజయ్ ఒక కిక్ బాక్సర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక సంచలన పోస్టర్ విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ పోస్టర్ కు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ మీద హీరోయిన్లు కొందరు ఆసక్తికరంగా స్పందించగా నెటిజన్లు కూడా తమకు ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు..ఒక నెటిజన్ అయితే విజయ్ కు ప్యాంట్ కూడా వేయడం ఆసక్తికరంగా మారింది. దానికి విజయ్ ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

 మిశ్రమ స్పందన

మిశ్రమ స్పందన


విజయ్ దేవరకొండ లైగర్ సినిమా నుంచి నేడు విడుదలైన విజయ్ దేవరకొండ లుక్ పెద్ద సంచలనానికి తెరలేపింది. పూర్తి నగ్నంగా ఉన్న విజయ్ దేవరకొండ ఒక ఫ్లవర్ బొకే తన మొలకు అడ్డం పెట్టుకున్నాడు. ఈ లుక్ విడుదలైనప్పటి నుంచి మిశ్రమ స్పందన దక్కుతుంది. అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ లుక్ గురించి స్పందించారు. సమంత, అనుష్క, రాష్మీక మందన్నా, జాన్వీ కపూర్ వంటి వారు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు.

ఎడిట్ చేసి

ఎడిట్ చేసి


అయితే నెటిజెన్స్ మాత్రం విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరహా ఫోజ్ కి అమీర్ ఖాన్ పీకే సినిమాలో రేడియో అడ్డం పెట్టుకొని ఇచ్చాడని గుర్తు చేస్తూ, తర్వాత దానికి స్పూఫ్ గా క్యాలీఫ్లవర్ మూవీలో సంపూర్ణేష్ బాబు నగ్నంగా కనిపించిన ఫోటోలను జత చేసి మరీ పై అనేక ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం ఒకడుగు ముందుకు వేసి దేవరకొండ న్యూడ్ ఫోటోను ఎడిట్ చేసి ప్యాంటు వేశాడు.

నిజమైన బ్రదర్ నువ్వే

నిజమైన బ్రదర్ నువ్వే


సదరు ఫోటోను ట్వీట్ చేయడంతో పాటు విజయ్ దేవరకొండను ట్యాగ్ చేసి. నాకు తర్వాత థాంక్స్ చెప్పు బ్రదర్.. అంటూ కామెంట్ కూడా చేశాడు. ఆసక్తికరంగా ఈ పోస్ట్ కి విజయ్ దేవరకొండ స్పందించారు. సకాలంలో ఆదుకునే నిజమైన బ్రదర్ నువ్వే.. అంటూ రిప్లై ఇవ్వడంతో ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఆగష్టు 25న విడుదల

ఆగష్టు 25న విడుదల


ఇక ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 25న విడుదల కానుంది.

విడుదల కూడా కాకముందే

విడుదల కూడా కాకముందే


ఈ సినిమాలో రమ్య కృష్ణ విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటిస్తుండగా మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాకముందే మరోవైపు పూరి-విజయ్ కాంబినేషన్ లో జనగణమన ప్రకటించారు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా వంశీ పైడిపల్లి నిర్మాణ భాగస్వామి కానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X