అలాంటి పనుల్లో తోడుగా ఉంటా.. విజయ్ దేవరకొండకు కొరటాల సపోర్ట్
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. ఏ పని చేసినా అందులో ప్రత్యేకత ఉంటుంది. నలుగురు చేసిన విధంగా కాకుండా.. నలుగురు చెప్పుకునే విధంగా అతని చేష్టలుంటాయి. అందుకే అతను ఇంత తక్కు సమయంలో అంత పెద్ద స్టార్ అయ్యాడు. అందర్నీ ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పర్చుకున్నాడు. తనకంటూ సొంత ఫాలోయింగ్, బిజినెస్, ఆర్గనైజేషన్ ఇలా అన్నింటికి క్రియేట్ చేసుకున్నాడు.
సాయం చేయడంలోనూ విజయ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కరోనాపై పోరాటంలో భాగంగా విజయ్ ఆర్థిక సాయం చేయడం లేదని, సైలెంట్‌గా ఉన్నాడని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే నేడు విజయ్ ప్రకటన చూసి అందరూ నోరెళ్లబెట్టారు.
ఈ పరిస్థితుల్లో పేదవాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం చాలా సపోర్ట్ గా ఉందని, కానీ మధ్య తరగతి ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నాడు. ప్రభుత్వం నుండి లబ్ది పొందలేని వారు,రేషన్ కార్డ్ లేని వారికి తన ఆర్గనైజేషన్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తానని పేర్కొన్నాడు.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా దానికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన కొరటాల శివ.. లవ్యూ బ్రదర్.. పది మందికి తోడుగా ఉండే పనుల్లో నీకు తోడుగా నేనుంటా.. కుమ్మేద్దాం.. మంచితో.. త్వరలోనే కలుసుకుందామ' రిప్లై ఇచ్చాడు. దీనికి ప్రతి స్పందనగా విజయ్ ట్వీట్ చేస్తూ.. 'శివ సర్.. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రతీసారి నేను ఎంతో ఎంజాయ్ చేశాను.. మనం కచ్చితంగా వంద శాతం సంతోషాన్ని క్రియేట్ చేయగలమ'ని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











